ఆరు నూరైనా మారని కాంబినేషన్స్ ఇవి!
ఆ త్రయం మాత్రం కోరుకుంటున్నట్లు కనిపించలేదు. ఇంతకీ ఎవరా దర్శక, సంగీత త్రయం అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.;
ఇండస్ట్రీలో హీరో-డైరెక్టర్ అనే కొన్ని సక్సెస్ పుల్ కాంబినేషన్స్ ఉంటాయి. అలాగని ఒకే దర్శకుడుని ఏ స్టార్ హీరో రిపీట్ చేయడు. ఎంత గొప్ప విజయాన్ని అందించినా? మరో సినిమా చేయడానికి రెండు..మూడేళ్లు లేదా? అంతకన్నా ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ టాలీవుడ్ కొందరు డైరెక్టర్లు - సంగీత దర్శకుల కాంబినేషన్ ని మాత్రం ప్రేక్షకులు ఎప్పటికీ మిస్ అయ్యేలా లేరు. కొత్తదనం కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నా? ఆ త్రయం మాత్రం కోరుకుంటున్నట్లు కనిపించలేదు. ఇంతకీ ఎవరా దర్శక, సంగీత త్రయం అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటి వరకూ 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. `స్టూడెంట్ నంబర్ 1`, `సింహాద్రి`, `సై`, `ఛత్రపతి`, `విక్రమార్కుడు`, `యమదొంగ`, `మగధీర`, `మర్యాద రామన్న`, `ఈగ`, `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` ఈ సినిమాల న్నింటికీ కీరవాణి మాత్రమే సంగీతం అందించారు. ప్రస్తుతం మహేష్ హీరోగా పాన్ ఇండియాలో `వారణాసి` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకైనా కొత్త సంగీత దర్శకుడిని తీసుకుంటాడని భావించారు. కానీ ఛాన్స్ తీసుకోలేదు. మళ్లీ కీరవాణినే రిపీట్ చేస్తున్నారు. అలాగే కన్నడ-తెలుగు మూలాలున్న మరో దర్శక దిగ్గజం ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకూ నాలుగు సినిమాల్ని డైరెక్ట్ చేసాడు.
అవే `ఉగ్రం`, `కేజీఎఫ్` రెండు భాగాలు, `సలార్` చిత్రాలకు రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తోన్న `డ్రాగన్` సినిమాకు కూడా రవి బస్రూర్ బాణీలు సమకూర్చుతున్నారు. చివరకు ప్రశాంత్ నీల్ కథ అందించిన `భగీరధ` సినిమాకు కూడా రవినే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. త్వరలో మొదలు పెట్టబోయే `సలార్ 2` కి కూడా రవి బస్రూర్ పని చేయనున్నాడు. అలాగే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటి వరకూ తొమ్మిది సినిమాలు డైరెక్ట్ చేసాడు. `ఆర్య`, `ఆర్య2,` `100 పర్సంట్ లవ్`, `జగడం`, `నేనొక్కడినే`, `నాన్నకు ప్రేమతో`, `రంగ స్థలం`,`పుష్ప` రెండు భాగాలు తెరకెక్కించారు.
వీటన్నింటికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కించే అప్ కమింగ్ చిత్రానికి కూడా దేవి శ్రీనే తీసుకున్నాడు. ఇలా ఆ మ్యూజిక్ డైరెక్టర్లు ముగ్గురు ..ఆ ముగ్గురు దర్శకులకు ఆస్థాన సంగీత దర్శకులుగా మారిపోయారు. ఈ కాంబినేషన్ విడిపోవడం ఆసాధ్యం. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ ఎన్ని సినిమాలు తీస్తే వాటన్నింటికీ వాళ్లే సంగీత దర్శకులుగా పని చేస్తారు. మరో కొత్త దర్శకుడిని తీసుకునే ఆలోచన ఆ ముగ్గురికి ఎంత మాత్రం లేనట్లే కనిపిస్తోంది. వాళ్లను మించిన సంగీత దర్శకులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నా? తీసుకునే పరిస్థితులైతే ఇప్పట్లో కనిపించలేదు.