• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైటిల్ మార్పులపై సెన్సార్...

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

| సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి.

By - Srikanth Kontham
Update: 2026-11-04 13:30 GMT

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సినిమా టైటిల్ మార్పులకు సంబంధించి బోర్డు తీసుకువచ్చిన కొత్త నిబంధన నిర్మాతల తలరాతను మార్చేసేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెన్సార్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు సినిమా టైటిల్‌కు ఎలాంటి చట్టబద్ధత ఉండదన్న నిబంధనే ఈ చర్చకు ప్ర‌ధాన కార‌ణం.

ఇప్పటి వరకు ఒక‌ సినిమా టైటిల్‌ను ముందుగానే రిజిస్టర్ చేసుకుని సుదీర్ఘకాలం పాటు పబ్లిసిటీ క్యాంపెయిన్ నిర్వహించడం ద్వారా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లేవారు. కానీ సెన్సార్ సర్టిఫికేషన్ వచ్చే వరకు టైటిల్ ఎప్పుడైనా మారవచ్చనే తాజా నిబంధన నిర్మాతల ప్రణాళికలను పూర్తిగా తలకిందులు చేస్తోంది. సంవత్సరాల తరబడి శ్రమించి ప్రేక్షకుల్లో తీసుకువెళ్లిన సినిమా పేరును ఒక్క రోజులో మార్చాల్సి వస్తే, ఆ బ్రాండ్ వాల్యూని మళ్లీ పునరుద్ధరించుకోవడం కష్టతరమని చిత్ర ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు అమిత్ రాయ్ ఈ నిబంధనలపై స్పందించారు. నిర్మాణం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని పేర్కొన్నారు. సినిమా పూర్తయిన తర్వాత ఇలాంటి మార్పులు చేయాల్సి వస్తే అది మరోసారి సినిమా తీయడంతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. టైటిల్ విషయంలోనే కాకుండా విడుదల తేదీల ప్రకటనలోనూ అనిశ్చితి నెలకొనడం వల్ల మేకర్స్‌కు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగులుతుందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రా యపడుతున్నారు.

స్వతంత్ర చిత్రాల దర్శకుడైన ఓనిర్ మాట్లాడుతూ సీబీఎఫ్‌సీ విధానాలు ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయని తెలిపారు. ఒకవైపు పూర్తిస్థాయి సినిమాను సమర్పించడం వంటి నిబంధనలు సహేతుకమే అయినా? పబ్లిసిటీ దశలో ఉన్న టైటిల్స్‌పై అనిశ్చితి నెలకొనడం వల్ల ప్రచార వ్యూహాలు దెబ్బతింటాయని వివ రించారు. చిన్న సినిమాలకు ఈ సమస్య మరింత తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రా యపడ్డారు.

మరోవైపు అహ్మద్ ఖాన్ వంటి కొందరు దర్శకులు ఈ కొత్త నిబంధనలను కాస్త భిన్నంగా చూస్తున్నారు. సీబీఎఫ్‌సీ నిర్ణయాల వెనుక వారిదైన కారణాలు ఉంటాయని.. మేకర్స్ మరింత అప్రమత్తంగా, నిబంధనలకు అనుగుణంగా తమ పనులను ముందుగానే చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏదేమైనా? ఈ సరికొత్త మార్గదర్శకాలు రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమలో నిర్మాణ శైలిని ..ప్రచార సరళిని పూర్తిగా మార్చేయ‌డం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
  • cbfc 
  • filmtitlerules 
  • indiancinema 
  • filmindustry 
  • cbfcguidelines 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS