• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ...

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

| భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది.

By - Madhu Reddy
Update: 2026-11-04 11:29 GMT

భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో చేసిన ప్రత్యేక పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఇప్పుడు చూద్దాం..

‘ఇది కేవలం సినిమా కాదు.. సంస్కృతికి ప్రతిబింబం!:

రామాయణం సినిమాపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. "ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. మన సంస్కృతికి ప్రతిబింబం మరియు భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరింత పెంచే ఒక గొప్ప ప్రయత్నం" అని బన్నీ కొనియాడారు. ఇక మన ప్రాచీన కథలను, సంస్కృతిని, భారతీయ వైభవాన్ని ముందడుగు వేయించే ఇలాంటి దివ్యమైన ప్రయత్నానికి సినీ ప్రేమికులందరం కలిసికట్టుగా అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.

థ్యాంక్స్ చెప్పిన డైరెక్టర్ నితీశ్ తివారీ:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఈ పాజిటివ్ పోస్ట్‌పై 'రామాయణ' చిత్ర దర్శకుడు నితీశ్ తివారీ వెంటనే స్పందించారు. అల్లు అర్జున్ అందించిన మద్దతుకు, తెలిపిన శుభాకాంక్షలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక పాన్-ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ చూపించిన ఈ అభిమానం మరియు ప్రోత్సాహం తమ చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి:

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటీనటుల ఎంపిక మొదటి నుంచీ విపరీతమైన క్రేజ్‌ను సంతరించుకుంది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతాదేవి పాత్రలో ఒదిగిపోయారు. ఇక కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. ఇక వీరి కాంబినేషన్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి.

నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్:

ఎంతో కాలంగా చిత్రసీమతో పాటు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రామాయణ: పార్ట్ 1' నవంబర్ 5,న బిగ్ స్క్రీన్లను పలకరించనుంది. ఇక హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తుందని పరిశ్రమ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక మొత్తానికి చూస్తే, రణ్‌బీర్-సాయిపల్లవిల ‘రామాయణ’ చిత్రానికి అల్లు అర్జున్ తెలిపిన మద్దతు సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక మన సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టేలా రూపొందిన ఈ అద్భుత కావ్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.


My best wishes to the entire #Ramayana team. It’s not just a movie. It’s a representation of our culture and an attempt to raise the bar of Indian films. I wholeheartedly send my pure, positive wishes to the entire team for their divine attempt. Let’s all unite and come forward to support a pure attempt that carries our stories, our culture and our glory. Jai Sri Ram 🙏🏽 #RanbirKapoor @TheNameIsYash @Sai_Pallavi92 @iamsunnydeol @niteshtiwari22 @malhotra_namit @arrahman @HansZimmer @raviedubey @LaraDutta @Rakulpreet @vivekoberoi @AnupamPKher @MsKajalAggarwal

— Allu Arjun (@alluarjun) November 4, 2026


Tags:    
  • alluarjun 
  • ramayana 
  • ranbirkapoor 
  • saipallavi 
  • tollywood 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS