వ్యక్తిగతంగానే కాదు వృత్తిగతంగానూ రియలైజేషన్!
ఎల్లకాలం ఒకే ఫేమ్ తో కొనసాగడం అన్నది స్టార్ హీరోలకి సైతం సాధ్యం కాదు. కెరీర్ లో ఎంతటి వారికైనా ఓ బ్యాడ్ ఫేజ్ అన్నది ఉంటుంది.;
ఎల్లకాలం ఒకే ఫేమ్ తో కొనసాగడం అన్నది స్టార్ హీరోలకి సైతం సాధ్యం కాదు. కెరీర్ లో ఎంతటి వారికైనా ఓ బ్యాడ్ ఫేజ్ అన్నది ఉంటుంది. అసమయంలో కెరీర్ ను తెలివిగా ప్లాన్ చేసుకున్న వాళ్లే పోటీని ఎదుర్కున్న వారే మార్కెట్లో నిలబడగలరు. ఆ బ్యాలెన్స్ ఏ మాత్రం తప్పినా? కెరీర్ మళ్లీ గాడి లో పడటం అన్నది అంత సులభం కాదు. ప్రముఖంగా ఓ నటుడి రియలైజేషన్ తో ఈ విషయం మరోసారి ప్రూవ్ అవుతుంది. ఇండస్ట్రీకి అతడు చిన్న పాత్రలతో పరిచయమయ్యాడు. నటుడిగా మంచి గుర్తింపు రావడంతో హీరోగానూ ప్రమోట్ అయ్యాడు. కొన్ని సినిమాల్లో హీరోగానూ కొనసాగాడు.
ఇదే సమయంలో ఆ నటుడిపై ఇండస్ట్రీ నుంచి కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవరించాడు అన్నది కొందరి వాదనగా అప్పట్లో తెరపైకి వచ్చింది. ఫాంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి విమర్శలను అతడు పెద్దగా పట్టించుకోలేదు. ఆ విమర్శల విలువ ఏంటి? అన్నది ఫాం కోల్పోయిన తర్వాత అర్దమైంది. అప్పటి వరకూ అవకాశాల పేరుతో అతడి ముందు నిలబడే వారంతా ఒక్కసారిగా చూసి సైడ్ అయిపోవడం మొదలు పెట్టారు. మరికొంత మంది వింతండ వాదితో సినిమాలెందుకని లైట్ తీసుకున్నారు.
ఈ క్రమంలో ఆ నటుడికి అవకాశాలు పూర్తిగా తగ్గాయి. ఇదే సమయంలో రాజకీయాల్లోనూ తనబాణీ వినిపించాడు. అలాగని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగలేదు. మంచి వక్త కావడంతో? అక్కడా మంచి పేరొచ్చింది. కానీ అదీ ఎంతో కాలం కొనసాగలేదు. అటు సినిమా పరంగా విమర్శ..ఇటు రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ నిప్పులు చెరగడంతో? అతడి వేగం రెండు రంగాల్లోనూ జీరోకు పడిపోయింది. దీంతో అటు సినిమాల్లోనూ..ఇటు రాజకీయాల్లో విశ్లేకుడిగానూ బలహీనంగా మారాడు. దీంతో రాజకీయాలు పక్కన బెట్టి మళ్లీ సిరియస్ గా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
లక్కీగా ఓ చిన్న సినిమాలో మంచి పాత్ర పడటంతో నటుడిగా కొత్త జర్నీ మొదలైనట్లు అయింది. ఈ సమయంలో మాత్రం తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఇండస్ట్రీలో నటుడిగా కొత్త ప్రయాణం దిగ్విజయంగా కొనసాగించాలని ..ప్రేక్షకులు కలకాలం గుర్తు పెట్టుకునే పాత్రలు పోషించాలని బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు కూడా చేసుకున్నాడు. మీడియా ముందు మాట్లాడి నలుగురిలో పడటం కంటే సైలెంట్ గా ఉంటే ఉత్తమంగా భావించాడు. దీంతో అప్పటి నుంచి మీడియా మైక్ కు దూరంగా ఉంటున్నాడు. వివాదాస్పద అంశాలకు దూరంగా కనిపిస్తున్నాడు. నటుడిగా తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే పాత్రలు పోషిస్తానని...వచ్చిన గుర్తింపును చెడగొట్టుకోనని బోలెడంత రియలైజేషన్ మాటల్లో చూపించాడు. మరి ఇది ఎంత ఆచరణలోకి తెస్తాడో చూడాలి.