టాలీవుడ్‌లో కొత్త డాన్సింగ్ క్వీన్స్!
జానపద పాటలు, తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా సోషల్ మీడియాలో విశేషమైన గుర్తింపు పొందిన నాగదుర్గ కథానాయికగా వెండితెరకు పరిచయమవుతోంది.
టాలీవుడ్ లో నటనతో పాటు డాన్సులతో ప్రేక్షకులను అలరించే కథానాయికలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. సహజసిద్ధమైన డాన్స్ స్టెప్పులతో లేడీ పవర్ స్టార్ గా సాయి పల్లవి టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్‌గా నిలవగా అటుపై శ్రీలీల ఎనర్జిటిక్ , ఫాస్ట్ మూమెంట్స్‌తో సరికొత్త సంచలనం సృష్టించింది. వేగవంతమైన డాన్స్ మూవ్స్‌తో కుర్రకారును ఆకట్టుకునే ఈ భామల బాటలోనే తాజాగా టాలీవుడ్ తెరపైకి మరో కొత్త డాన్సింగ్ క్వీన్ ఎంట్రీ ఇస్తోంది. జానపద పాటలు, తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా సోషల్ మీడియాలో విశేషమైన గుర్తింపు పొందిన నాగదుర్గ కథా నాయికగా వెండితెరకు పరిచయమవుతోంది.
జానపద గేయాల్లో గ్రేస్, రిథమ్ , నాటు స్టెప్పులతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ వెండితెరపై కూడా డాన్స్ ప్రతిభతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతోన్న `ఇడుపు కాయితం` అనే వినూత్న చిత్రంలో నాగదుర్గ కథానాయికగా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ .. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న సినిమాలో అమ్మడు నటనతో పాటు తన డాన్స్ స్కిల్స్‌ను కూడా పూర్తి స్థాయిలో ఆవిష్కరించే అవకాశం లభించింది.
ఈ ప్రాజెక్ట్ ప్రకటన నుంచే నాగదుర్గ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన 'శ్రీలత' అనే మెలోడీ అండ్ ఫోక్ మిక్స్డ్ పాటలో నాగదుర్గ డాన్స్ స్టెప్స్‌తో అదరగొట్టింది. భార్యాభర్తల మధ్య ఉండే క్యూట్ లవ్ .. అల్లరి నేపథ్యంలో సాగే చిత్రంలో అమ్మడి సహజమైన ఎక్స్‌ప్రెషన్లు, లైట్-ఫుటెడ్ మూమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మొదటి సినిమా పాటలోనే ఇంతటి గ్రేస్ చూపించడంతో? నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సాయి పల్లవి, శ్రీలీల వంటి నటీమణులు ఎలాగైతే డాన్స్‌తో సినిమాలకు అదనపు ఆకర్షణగా మారారో? నాగదుర్గ కూడా మొదటి చిత్రంతోనే అదే తరహా గుర్తింపును సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఫోక్ సాంగ్స్ నుండి వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ కావడంతో అమ్మడి బాడీ లాంగ్వేజ్‌లో ఈజ్ ..తెలంగాణ మట్టి వాసనతో కూడిన ఎనర్జీ స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తానికి `ఇడుపు కాయితం` రిలీజ్ కు ముందే నాగదుర్గ నెట్టింట సంచలనమవుతోంది. అమ్మడి డాన్సుకు ఈ రేంజ్లో అప్లాజ్ వస్తుంటే? నటిగా కూడా ప్రూవ్ చేసుకుంటే? రెట్టింపు క్రేజ్ తో దూసుకుపోవడం ఖాయం. టాలవుడ్ కి నేచురల్ హీరోయిన్లు కరువవుతోన్న తరుణంలో నాగదుర్గ లాంటి నటి సక్సెస్ అయితే? ఆలోటు కొంత వరకైనా భర్తీ అవుతుంది. అయితే ఇలాంటి ప్రతిభావంతుల్ని గుర్తించి దర్శక, నిర్మాతలు అంతే చొరవగా అవకాశాలు కల్పించాలి. అప్పుడే తమని తాము పూర్తి స్థాయిలో నిరూపించుకోగలరు.