జెర్సీ కాంబో సెట్ చేస్తున్నారా..?

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.;

Update: 2025-12-26 05:47 GMT

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఎప్పుడు గెలిచిన వారి గురించే అందరు చెప్పుకుంటారు కానీ ఓడిపోయిన వ్యక్తిని అసలు పట్టించుకోరు. అదే కాన్సెప్ట్ తీసుకుని జెర్సీ సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు గౌతం. సితార బ్యానర్ కి ఒక పుష్ ఇచ్చిన సినిమా కూడా అదే. ఆఫ్టర్ జెర్సీ నాని, సితార బ్యానర్ సినిమా చేయలేదు.

2026లో నానితో సినిమా..

లేటెస్ట్ గా నాగ వంశీ నానితో సినిమా గురించి రివీల్ చేశారు. 2026లో నానితో సినిమా ఉంటుందని అన్నారు. 2026 సెకండ్ హాఫ్ లో నాని సినిమా మొదలవుతుందని చెప్పారు. ఐతే డైరెక్టర్ మిగతా డీటైల్స్ త్వరలో చెబుతామని అన్నారు. నానితో సినిమా అంటే ఎలాగు సితార బ్యానర్ కాబట్టి మళ్లీ గౌతం తిన్ననూరితోనే జెర్సీ కాంబో రిపీట్ చేస్తారని అనుకుంటున్నారు.

గౌతం తో సితార నాగ వంశీ కింగ్ డమ్ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఐతే నానితో గౌతం కాకపోతే హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ నడుస్తుంది. శౌర్యువ్ కి మొదటి ఛాన్స్ ఇచ్చిన నాని అతనితో రెండో సినిమా కూడా ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. ఐతే ఈ ఇద్దరు కాకపోతే సితార ఆస్థాన డైరెక్టర్ వెంకీ అట్లూరితో నాని సినిమా ఉంటుందని అంటున్నారు.

సితార బ్యానర్ లోనే సార్, లక్కీ భాస్కర్..

సితార బ్యానర్ లోనే సార్, లక్కీ భాస్కర్ సినిమాలు తీసి సూపర్ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ప్రస్తుతం సూర్యతో సినిమా చేస్తున్నాడు. సో ఆ సినిమా తర్వాత నానితో వెంకీ సినిమా ఉంటుందని టాక్. వెంకీతో నాని కచ్చితంగా ఈ కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. సితార నాగ వంశీ నెక్స్ట్ ఇయర్ తన బ్యానర్ నుంచి భారీ సినిమాలు రాబోతున్నాయని అన్నారు.

నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు ఆ సినిమా పూర్తి కాగానే సుజిత్ తో సినిమా ఫిక్స్ అయ్యింది. ఆ సినిమా చేస్తూనే సితార బ్యానర్ సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. ఐతే సితార, నాని కాంబినేషన్ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

వరుస సక్సెస్ లతో నాని సినిమా అంటే చాలు పక్కా హిట్ అనే వైబ్ వచ్చింది. రాబోతున్న ది ప్యారడైజ్ సుజిత్ సినిమా కూడా అదే హిట్ ఫాం కొనసాగిస్తాయని అంటున్నారు. సితార నాగ వంశీ అక్కినేని నాగ చైతన్యతో కూడా సినిమా ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. నాగ చైతన్య సినిమాతోనే ఈ బ్యానర్ మొదలు కాగా అతనితో సినిమాకు కొంత టైం తీసుకున్నారు. త్వరలో చైతన్యతో సితార సినిమా కూడా అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.

Tags:    

Similar News