'వెల్డన్' అల్లు అర్జున్ అంటూ డేవిడ్ వార్నర్ పోస్ట్.. వైరల్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్

Update: 2020-11-24 07:50 GMT
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో ఎంత డి బ్లాక్ బస్టర్ గా అందరికీ తెలిసిందే. సినిమానే కాదు ఇందులోని పాటలు కూడా అంతే విజయం సాధించాయి. నిజం చెప్పాలంటే ఆ సినిమా సక్సెస్ సాధించడానికి, బ్లాక్ బస్టర్ గా నిలబడడానికి తమన్ అందించిన మ్యూజిక్ కూడా ఓ కారణమే. సామజవర గమన, బుట్ట బొమ్మ, రాములో రాముల పాటలు ఇండియా వైడ్ గా సెన్సేషన్ సృష్టించాయి.  బుట్ట బొమ్మ సాంగ్ కయితే పలువురు బాలీవుడ్ హీరోయిన్లు కాలు కదిపి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇక టిక్ టాక్ ఉన్నప్పుడు అయితే అల వైకుంఠ పురం లో సినిమాలోని పాటలకు కోట్లాది వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్లో ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ కి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి.

అన్నిటికంటే పెద్ద సెన్సేషన్ ఏంటంటే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అల వైకుంఠ పురములోని అన్ని పాటలకు టిక్ టాక్ లు చిందులేశారు. తన సతీమణితో కలిసి బుట్ట బొమ్మ, రాములో రాముల పాట లకు పలుసార్లు డాన్స్ వేసి ఆ వీడియోలను టిక్ టాక్ లో, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. అల్లు అర్జున్ కూడా స్పందించి డేవిడ్ వార్నర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే అప్స్ కి చేరగానే డేవిడ్ వార్నర్ తన  టీం సభ్యులతో కలిసి బుట్ట బొమ్మ సాంగ్ కు స్టెప్స్ వేశారు.

కాగా ప్రస్తుతం అల వైకుంఠ పురములో మూవీలోని బుట్ట బొమ్మ సాంగ్ మరో గ్రాండ్ రికార్డ్ అందుకుంది. యూట్యూబ్లో ఆ పాటకు 450 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ కు తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్డన్ అని స్టేటస్ పెట్టారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. వార్నర్ కామెంట్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.బన్నీ ఇమేజ్ ఎల్లలు దాటింది.. అని చెప్పడానికి ఇదే నిదర్శనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే డేవిడ్ వార్నర్ కామెంట్ పై అల్లుఅర్జున్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Tags:    

Similar News