వారణాసి.. ఓవర్సీస్ కోసం అసలైన కాంటెంట్!
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు గ్లోబల్ లెవల్‌కు వెళ్ళిపోయింది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే దానిపై ఉండే ఆసక్తి కేవలం మన దేశానికే పరిమితం కావడం లేదు.;
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు గ్లోబల్ లెవల్‌కు వెళ్ళిపోయింది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే దానిపై ఉండే ఆసక్తి కేవలం మన దేశానికే పరిమితం కావడం లేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఆయన చేస్తున్న ‘వారణాసి’ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియన్ ఆడియన్స్‌కే కాకుండా గ్లోబల్ మార్కెట్‌కు ముందే పరిచయం చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, మెక్సికోలో జరగబోతున్న ప్రతిష్టాత్మక ‘CCXP మెక్సికో’ వేదికపై ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను ప్రదర్శించబోతున్నారు. ఏప్రిల్ 24న జరగబోయే ఈ ఈవెంట్‌కు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ స్వయంగా హాజరవుతున్నారు. రాజమౌళి నేరుగా రాకపోయినా, ఒక ప్రత్యేకమైన వీడియో మెసేజ్ ద్వారా అక్కడి ప్రేక్షకులను పలకరించనున్నారు.
ఈ ఈ ఈవెంట్ లో సినిమాకు సంబంధించిన కొన్ని ముందస్తు విజువల్స్, బిహైండ్ ద సీన్స్ ఫుటేజీని మొదటిసారిగా రివీల్ చేయబోతుండటం విశేషం. ఇది సినిమా ఇంటర్నేషనల్ ప్రమోషన్లకు గట్టి పునాది వేయబోతోంది. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుమారు 1200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ సినిమా విజువల్స్ ప్రేక్షకులకు ఒక కిక్ ఇవ్వనున్నాయి. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో కార్తికేయకు చెందిన ‘షోయింగ్ బిజినెస్’ కూడా భాగస్వామిగా ఉంది. ఇలాంటి పెద్ద ఈవెంట్లలో పాల్గొనడం వల్ల సినిమాపై గ్లోబల్ మార్కెట్‌లో ముందే ఒక క్రేజ్ ఏర్పడుతుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ చిన్న బ్రేక్ తీసుకుంది. త్వరలోనే తదుపరి దశ చిత్రీకరణ ప్రారంభం కానుంది. రాజమౌళి ప్లానింగ్ ప్రకారం ప్రతిదీ చాలా పక్కాగా సాగుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలో ఉండే ఇంటర్నేషనల్ అపీల్ విదేశీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. అందుకే మెక్సికో లాంటి వేదికలను ఎంచుకుని సినిమా ప్రమోషన్లను ఇప్పటి నుండే స్పీడప్ చేస్తున్నారు. మొత్తానికి ‘వారణాసి’తో టాలీవుడ్ మరోసారి ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించబోతోంది. బిజినెస్ పరంగా కూడా కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. మెక్సికో ఈవెంట్‌లో చూపించబోయే కంటెంట్ ఏ స్థాయిలో ఉండబోతుందోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.