ఆ విషయంలో తెలుగు హీరోలకు సవాల్ విసురుతున్న తమిళ్ హీరోలు...

ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక మూవీ వస్తుందంటే ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ అయ్యేది. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేవారు.

Update: 2026-09-15 22:30 GMT

సినిమా ఇండస్ట్రీ లో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన వాళ్లకు మాత్రమే ఎక్కువ క్రేజ్ దక్కుతుంది. ప్రస్తుతం తెలుగులో ఆరుగురు టైర్ వన్ హీరోలు, నలుగురు సీనియర్ హీరోలు ఉన్నారు. ఇక మీడియం రేంజ్ హీరోలు చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వీళ్ళందరికీ తమిళ్ హీరోలు పెను సవాళ్లను విసురుతున్నారు. ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక మూవీ వస్తుందంటే ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ అయ్యేది. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేవారు.

కానీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ పూర్తిగా వెనకబడిపోయింది. పాన్ ఇండియాలో వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం లో ప్రతి సారి ఫెయిల్ అవుతున్నారు. తెలుగులో వచ్చిన 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. తెలుగు మలయాళం, కన్నడ భాషల్లోని హీరోలు 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతుంటే తమిళ్ హీరోలు మాత్రం ఇప్పటి వరకు ఒక్కరు కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టలేకపోతున్నారు. ఇక ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి తమిళ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు మా హీరోలు భారీ కలెక్షన్స్ ను రాబట్టలేకపోయిన కూడా మా కెరియర్ లో ఎన్నో డిఫరెంట్ పాత్రలను పోషించాము.

ఆ విషయంలో మాకు సంతృప్తిగా ఉంది. కానీ మీరు మాత్రం జన్మ లో మా హీరోలు చేసిన క్యారెక్టర్స్ ను చేయలేరనే అర్థం వచ్చేలా మన హీరోల మీద ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తున్నారని మనవాళ్ళు కొందరు తమిళ్ ప్రేక్షకుల మీద ఫైర్ అవుతున్నారు. నిజానికి ఇండస్ట్రీ లో సక్సెస్ ఉన్న హీరోలకు మాత్రమే వాల్యూ ఉంటుంది. ఎవరైతే అత్యధిక కలెక్షన్స్ ను కొల్లగొడుతారో వాళ్లకి గొప్ప గుర్తింపు ఉంటుంది. అందుకే చాలా మంది హీరోలు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. ఇక తమిళ హీరోలు ఆ విషయంలో వెనకబడి పోయారు. కాబట్టి అక్కడి ప్రేక్షకులు దానిని సైడ్ ట్రాక్ కి తీసుకెళ్లడానికి వాళ్ల హీరోలు పోషించిన పాత్రల గురించి వాళ్ళకి వచ్చిన అవార్డుల గురించి మాట్లాడుతున్నారు...

ఏది ఏమైనా కూడా సినిమా అనేది ఒక బిజినెస్... పెట్టిన పెట్టుబడి పోను ఎంతో కొంత లాభం వస్తేనే ప్రొడ్యూసర్ మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తాడు. లేకపోత తను డీలా పడిపోయే ప్రమాదం ఉందని మరికొంతమంది సినిమా మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు... ఫైనల్ గా సౌత్-నార్త్, తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా బెస్ట్ సినిమాలు వచ్చిన ప్రతి సారి ఇండియాలో ఉన్న ప్రేక్షకులందరు ఆ సినిమాలను ఆదరించి సూపర్ హిట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి...

Tags:    

Similar News