సునీల్ లాగే సప్తగిరి.. చేసిన పొరపాటు ఏంటో తెలుసా?
సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఒక్కసారి ఇందులోకి దిగాక ఇక మరలిపోవడం కష్టం.. కోట్లు సంపాదించినా ఇక్కడే ఖర్చు చేస్తాం.. చివరకు ఇక్కడే పోగొట్టుకుంటాం.. సినిమాల్లో ఎంతో మంది బాగా సంపాదించి అప్పులపాలై దారుణమైన స్థితికి దిగజారిన వారున్నారు. అప్పట్లో వచ్చిన ‘మహానటి’ సినిమాలో అలనాటి మేటి హీరోయిన్ సావిత్రి అంతిమగడియలు ఎంత దుర్లభంగా గడిచాయో మనం చూశాం..
సప్తగిరి .. తెలుగు తెరపై దూసుకువచ్చిన కమెడియన్.. డిఫెరెంట్ యాసతో అందరినీ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఇతడు సినిమాల్లో కనిపించాడంటే ఈలలు,గోలలు ఉండేవి.. కానీ ఇది గతం.. ఉవ్వెత్తున దూసుకొచ్చిన ఈ కమెడియన్ ఇప్పుడు తెలుగుతెరపై అంతే వేగంగా కనుమరుగయ్యాడు.. ఇంతకీ సప్తగిరి చేసిన తప్పేంటో తెలుసా.?
సప్తగిరి మొదట కమెడియన్ గా సినిమాల్లో మెరిశాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గా అలరించాడు. పెద్ద పెద్ద హీరోల పక్కన చాన్సులు వచ్చాయి. ఆ తరుణంలోనే హీరోగా చాన్సులు వచ్చాయి. ఈ చాన్సులకు ఉబ్బితబ్బిబైన సప్తగిరి హీరోగా వరుసగా సినిమాలు చేశాడు. సప్తగిరి ఎల్ఎల్ బీ లాంటి కామెడీ సినిమాలు ట్రై చేశాడు. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇక హీరోగా వెళ్లిపోయిన సప్తగిరి డేట్స్ అడ్జస్ట్ అవుతాయో కావో అని చాలా మంది దర్శకులు సప్తగిరిని తమ సినిమాల్లో తీసుకోవడం లేదు. అంతేకాదు.. హీరోగా కొనసాగుతుండడంతో మళ్లీ కమెడియన్ పాత్రల కోసం సంప్రదించడం లేదు. దీంతో సప్తగిరి అటు హీరోగా.. ఇటు కమెడియన్ గా కూడా కనిపించకుండా పోయారు.
కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కూడా ఇలాంటి తప్పటడుగే వేశాడు.. కమెడియన్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలోనే అనవసరంగా సినిమాల్లో హీరోగా ట్రై చేశాడు. మొదట రెండు హిట్లు పడగానే కమెడియన్ పాత్రలను వదిలేశాడు. ఇప్పుడు హిట్స్ లేక మళ్లీ కమెడియన్ పాత్రలు ట్రై చేసినా సరైన బ్రేక్ రావడం లేదు. ఇలా కమెడియన్స్ హీరోలుగా మారుదామనే తొందరలో మొత్తం లైఫ్ నే కోల్పోతున్నారు.