చిరు, పవన్.. ఒకే రోజు ముహూర్తం

Update: 2016-04-26 04:59 GMT
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. రీసెంట్ గానే ఆ ముహూర్తం ఎప్పుడో చెప్పేశారు చిరంజీవి. సర్దార్ గబ్బర్ సింగ్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ మూవీని చేస్తున్నారనే ప్రశ్నకు ఇండస్ట్రీ దగ్గర ఓ క్లారిటీ ఉంది. కానీ ఆయన్నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడీ అన్నాదమ్ములు ఇద్దరూ ఒకే రోజున తమ సినిమాలకు ముహూర్తం షాట్ తీసేయాలని డిసైడ్ అయ్యారు.

ఈ నెల 29.. మధ్యాహ్నం 1.30కి చిరంజీవి కత్తి రీమేక్ ప్రారంభానికి సుముహూర్తం ఖాయమైంది. ఇప్పుడు అదే డేట్ కి పవన్ కూడా తన సినిమాకి కొబ్బరికాయ కొట్టేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఎస్ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికే ఈ ముహూర్తం షాట్ ఉంటుందని తెలుస్తోంది. ఇలా ఇద్దరూ ఒకే రోజును సెలక్ట్ చేసుకోవడానికి కారణం.. ఆ రోజు తర్వాత మంచి రోజులు లేకపోవడమే. పుష్కరాల సందర్భంగా ఈ నెల 29 దాటితే మంచి ముహూర్తాలు లేవు.

చిరంజీవి నటించనున్న 150వ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ ని అనుకుంటూ ఉండగా.. పవన్ కళ్యాణ్ మూవీకి హుషారు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. చిరుకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. పవన్ పిక్చర్ కి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
Tags:    

Similar News