అందులో అమీ ఆరితేరిపోయింది

బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ ఇప్పుడు ఇండియాలో వెలిగిపోతున్న హాట్ బ్యూటీస్ లిస్ట్ లో టాప్ లోనే ఉంటుంది. ఈమె చేసే సినిమాలు కూడా భారీ చిత్రాలే కావడంతో.. ఎప్పుడూ వెలిగిపోతూనే ఉంటుంది. అలాగని చేతిలో బోలెడన్ని సినిమాలు ఏమీ ఉండవు. చేసినంత వరకూ తన స్పెషాలిటీ ప్రూవ్ చేసుకుంటూ ఉంటుందంతే.
అమ్మడి కెరీర్ ఊపందుకుని డైరీ ఫుల్ అయిపోవాలంటే.. ఖచ్చితంగా బాలీవుడ్ లో ఓ అండ కావాల్సిందే. ఆ విషయం లేట్ గా గ్రహించిన అమీ.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ చెంతకు చేరింది. #BeingHuman అనే కేంపెయిన్ లో చేరిపోయింది అమీ జాక్సన్. ఇందులో భాగంగా సల్మాన్ ఖాన్ భజన కూడా భలేగా చేసేస్తోంది. కండలవీరుడితో బాగా క్లోజ్ గా కలిసి దిగిన ఫోటోను నెట్ లో పెట్టేసి #BeingSalmanKhan అని కూడా అనేస్తోంది. మనిషి అనే పదానికి పర్యాపదం సల్మాన్ ఖాన్ అని పొగిడేస్తోందంటే ఈమె గారి భజన ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. అయితేనేం.. సల్మాన్ అండ ఉంటే అవకాశాలు వరుసగా వచ్చేస్తాయిలే.
ప్రస్తుతం 2.0 అంటూ శంకర్ డైరెక్షన్ లో రజినీకాంత్ తో కలిసి నటిస్తున్న అమీ జాక్సన్.. తాజా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోనుందని చెప్పింది. ఆ తర్వాత అమీ చేయబోయే మూవీ ఏంటా అనే డౌట్స్ బాగానే ఉన్నాయ్ కానీ.. వీటికి సల్మాన్ సమాధానం చెప్పేస్తాడులే!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/