#జనసేనాని.. 365 కేకులతో పండగ చేసిన `తుని` ఫ్యాన్స్
#PSPK బర్త్ డే వేడుకలు నేడు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త దృశ్యాల్ని ఆవిష్కరించాయి. అభిమానులు ఈ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. సినీరాజకీయరంగ ప్రముఖులు పవన్ కి శుభాకాంక్షలు తెలపగా.. మెగా కుటుంబ హీరోలంతా ప్రత్యేకించి పవన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
వీటన్నిటినీ మించి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కోసం 365 కేకులు కట్ చేసి తమ ఫేవరెట్ పై ఉన్న అపారమైన ప్రేమాభిమానాల్ని చాటుకున్నారు తుని (తూ.గో జిల్లా)కి చెందిన అభిమానులు. పదుల సంఖ్యలో కేకులు కట్ చేయడం రొటీనే అనుకున్నారో ఏమో ఏకంగా 365 కేకులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఆర్డర్ చేయడమే గాక.. గ్రౌండ్స్ లో బారులు తీరిన ఫ్యాన్స్ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటన తుని నగరంలోని రాజా కళాశాల మైదానంలో జరిగింది. అందుకు సంబంధించిన వైరల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల్లో సంచలనంగా మారింది. ఇక తుని కి రాజా దాడిశెట్టి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కాపు వర్గానికి చెందిన నాయకుడు కావడంతో పవన్ బర్త్ డే కార్యక్రమానికి ఏ అడ్డంకి లేకుండా కొనసాగింది.
పవర్ స్టార్ .. పవర్ స్టార్! అంటూ పవన్ అభిమానులు ఈ వేడుకల్లో బ్లాక్ టీషర్ట్స్ ధరించి నినదించారు. టీషర్ట్స్ పై `పవనిజం` అని ఇంగ్లీష్ అక్షరాల్లో రాసి ఉంది. నిజానికి పవన్ కి మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న ప్రాంతమిది. తుని- పాయకరావు పేట బీసీ సెంటర్లలో మెగా సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ వసూళ్లతో రికార్డులు బ్రేక్ చేస్తుంటాయి. తుని- సూరవరం- పాయకరావుపేట- అరట్ల కోట-మంగవరం-సత్యవరం- రాంభద్రపురం ప్రాంతంలో పవన్ కి వీరాభిమానులున్నారు. తుని-కాకినాడ బెల్ట్ లో పవనిజానికి ఊపు తెచ్చే ఫ్యానిజం ఇక్కడే ఉంది.
వీరంతా పవనిజం పేరుతో గ్రూపుగా ఏర్పడి ఇలా ఒక మైదానం చుట్టూ 365 కేకుల్ని పేర్చి కట్ చేయడం నిజంగా అది ఒక విజువల్ వండర్ నే తలపించింది. ఇది కచ్చితంగా పవన్ క్రేజ్ ని వేరే స్థాయికి తీసుకెళ్లింది. పవన్ పుట్టినరోజు కానుకగా నేడు `భీమ్లా నాయక్` మొదటి సింగిల్ ఆవిష్కరించగా వైరల్ అయ్యింది. ఇది టాప్ 5 అత్యంత లైక్ లు పొందిన లిరికల్ పాటలలో ఒకటిగా నిలిచింది. పవన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నారు. `హరి హర వీర మల్లు` చిత్రాన్ని 29 ఏప్రిల్ 2022 న విడుదల చేస్తారు. తదుపరి హరీష్ శంకర్ .. సురేందర్ రెడ్డిలతో పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారు.