నటి బ్రా వివాదం... కేసు నమోదు!

ఈ మధ్య కాలంలో పబ్లిసిటీ పేరుతో వింత వింత పనులు చేస్తున్నారు. కొన్ని సార్లు హద్దులు దాటి ప్రమోషన్‌ చేస్తున్నారు.;

Update: 2026-01-27 06:25 GMT

ఈ మధ్య కాలంలో పబ్లిసిటీ పేరుతో వింత వింత పనులు చేస్తున్నారు. కొన్ని సార్లు హద్దులు దాటి ప్రమోషన్‌ చేస్తున్నారు. ఎలాగైనా జనాల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో చేస్తున్న పనులు ప్రమాదకరంగా మారుతున్నాయి, కొన్ని సార్లు వివాదాస్పదం అవుతున్నాయి. ఆ మధ్య ఒక వ్యక్తి సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావడం కోసం అత్యంత ప్రమాదకరమైన రిస్కీ బైక్ స్టంట్స్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది చాలా రకాలుగా సోషల్‌ మీడియా పాపులారిటీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా చేస్తే, మరికొందరు తమ ప్రొడక్ట్‌ ను జనాల్లోకి తీసుకు వెళ్లడం కోసం సోషల్‌ మీడియాలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా కొన్ని రకాల ప్రొడక్ట్‌లను ప్రమోట్‌ చేయడం కోసం వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు.

నటి సిడ్నీ స్వీనీ బ్రాండ్‌ ప్రమోషన్‌...

ఇటీవల లాస్ ఏంజెలిస్ లో ఒక నటి చేసిన పని తీవ్ర వివాదాస్పదం అయింది. తన ప్రొడెక్ట్‌ ను ప్రమోట్ చేయడం కోసం ఆమె ఎంపిక చేసుకున్న మార్గం ఏమాత్రం కరెక్ట్‌ కాదని అందరూ మూకుమ్మడిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పని ఎలా చేస్తావు అంటూ ఆమెపై కేసులు నమోదు చేసేందుకు సైతం పోలీసులు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విషయం ఏంటంటే... హాలీవుడ్‌ నటి సిడ్నీ స్వీనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె తన బ్రా బ్రాండ్‌ ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్‌ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య ఏకంగా అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ దృష్టిని ఆకర్షించి తన బ్రా బ్రాండ్‌ కోసం పెట్టుబడులు ఆకర్షించింది. ఆయనతో పెట్టుబడులు పెట్టించడం ద్వారా మరింతగా జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆమె భావిస్తోంది. ఇదే సమయంలో తన బ్రాండ్‌ ను ప్రమోట్‌ చేయడానికి వింత పద్దతి ఎంపిక చేసుకుంది.

లాస్ ఏంజెలిస్ హాలీవుడ్‌ బోర్డ్‌...

లాస్ ఏంజెలిస్ లో ఉండే ప్రఖ్యాత హాలీవుడ్‌ బోర్డ్‌ పై తన బ్రాండ్‌ లో దుస్తులను దండగా వేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేసింది. అందుకోసం తన టీంతో కలిసి చాలా పెద్ద సాహసం చేసిందని చెప్పాలి. నైట్‌ టైమ్‌ లో ఆమె తన టీమ్‌ తో కలిసి స్వయంగా అక్కడి వరకు వెళ్లి తన బ్రాండ్‌ కు చెందిన బ్రా లను దండగా ఏర్పాటు చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఆ వీడియోను తీసి సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం తో వైరల్‌ అయింది. హాలీవుడ్‌ బోర్డ్‌ మీద తన బ్రాండ్‌ బ్రా లను దండగా వేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తన బ్రాండ్‌ వ్యాల్యూ పెరుగుతుందని ఆశ పడింది. కానీ ఆమె చేసిన పనికి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ఈ వివాదాన్ని ముందే ఊహించింది అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.

నటిపై క్రిమినల్‌ కేసు..

ఆమె అనుకున్నట్లుగానే బ్రా బ్రాండ్‌ కి మంచి ప్రమోషన్ దక్కింది. అంతే కాకుండా ఇన్నాళ్లు కొందరికి మాత్రమే తెలిసిన సిడ్నీ స్వీనీ ఈ మధ్య అందరికీ తెలిసి పోయింది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రమోషన్‌ కోసం చేసిన పని కారణంగా క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది. కొందరు ఇప్పటికే హాలీవుడ్‌ ను అవమానించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేయడం మొదలు పెట్టారు. ఆమెపై క్రిమినల్‌ కేసులను పెట్టాలంటూ డిమాండ్‌ చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఆమె మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అడిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె క్షమాపణ కోరినా క్రిమినల్‌ కేసు నమోదు చేయాల్సిందే అని కొందరు అంటున్నారు. ఏం జరగబోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News