రజినీ 'కూలీ'.. లోకేష్ ఇలాంటి స్టేట్మెంట్ ఏంటి?
ముఖ్యంగా సెన్సార్ రివైజింగ్ కమిటీ U/A సర్టిఫికెట్ ఇవ్వడానికి 35 కట్స్ అడిగిందని లోకేష్ కనగరాజ్ తెలిపారు.;
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా.. మూవీ లవర్స్ ను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు భారీగా రాబట్టినా.. రెస్పాన్స్ మాత్రం మిక్స్ డ్ గానే అందుకుంది. దీంతో లోకేష్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అప్పటి వరకు వివిధ సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న లోకేష్.. కూలీ మూవీతో మాత్రం ట్రోలింగ్ ను ఎదుర్కొన్నారు. దీంతో ఆ సినిమాపై కొన్ని నెలల వరకు రెస్పాండ్ అవ్వలేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లోకేష్.. తప్పులు సరిదిద్దుకుంటానని తెలిపారు. రజినీ కాంత్ కోసం థియేటర్స్ కు సినిమా చూసేందుకు వచ్చారని కూడా వ్యాఖ్యానించారు.
కానీ ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో కూలీ మూవీపై లోకేష్ కనగరాజ్ చేసిన కామెంట్స్.. హాట్ టాపిక్ గా మారాయి. థియేటర్స్ లో కూలీ మూవీ.. 35 రోజుల రన్ తో కొనసాగిందని చెప్పారు. సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ.. తమ కూలీ ప్రాజెక్టు ఫ్రాఫిట్స్ అందుకున్న మూవీగా ధ్రువీకరించిందని చెప్పారు. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ వసూళ్లు సంపాదించిందని అన్నారు.
ముఖ్యంగా సెన్సార్ రివైజింగ్ కమిటీ U/A సర్టిఫికెట్ ఇవ్వడానికి 35 కట్స్ అడిగిందని లోకేష్ కనగరాజ్ తెలిపారు. కానీ ఏ సర్టిఫికెట్ ఇవ్వడం వల్లే తాము ఏకంగా 60 కోట్ల మేర నష్టపోయామని చెప్పారు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, హింస కారణంగా సెన్సార్ బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి వెనుకాడారని తెలుస్తోందని అన్నారు.
ఏదేమైనా కూలీ కమర్షియల్ మూవీ అని, 500 కోట్లు వసూలు చేసిన సినిమాపై ఇప్పుడు విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం లోకేష్ కామెంట్స్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. వసూళ్ల విషయంపైనే ఆయన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ కన్నా కలెక్షన్స్ పై ఆయన దృష్టి మళ్లిందా అంటూ అడుగుతున్నారు.
ఒకప్పుడు అలా లేదని.. కానీ ఇప్పుడు అలా ఆలోచిస్తున్నట్లు ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు. కూలీ మూవీ రిజల్ట్ ను ఒప్పుకునే కన్నా.. సినిమా కమర్షియల్ హిట్ అని చెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఊహించలేదని అంటున్నారు. అయితే అప్ కమింగ్ మూవీస్ సినిమాలో అయినా కంటెంట్ పై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. మొత్తానికి లోకేష్ కనగరాజ్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.