తరుణ్ భాస్కర్ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది..?

డైరెక్టర్ గా యూత్ పల్స్ పట్టేసిన తరుణ్ భాస్కర్ అతని సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఉంటారు.;

Update: 2026-01-27 07:35 GMT

డైరెక్టర్ గా యూత్ పల్స్ పట్టేసిన తరుణ్ భాస్కర్ అతని సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఉంటారు. ఈమధ్యనే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లిన తరుణ్ భాస్కర్ ఓ పక్క తను యాక్టర్ గా కూడా బిజీగా ఉన్నాడు. తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో ఈషా రెబ్బా ఫిమేల్ లీడ్ గా వస్తున్న సినిమా ఓం శాంతి శాంతి శాంతి. ఈ సినిమాను సృజన్ డైరెక్ట్ చేశారు. మలయాళ సినిమా జయ జయ జయ జయ హే రీమేక్ గా ఇది వస్తుంది.

ఓం శాంతి శాంతి శాంతి సినిమా ప్రమోషనల్ కంటెంట్..

జనవరి 30న రిలీజ్ అవబోతున్న ఓం శాంతి శాంతి శాంతి సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. తరుణ్ ఈ సినిమా ఎందుకు చేశాడు అన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుంది అని అంటున్నారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమా ఒరిజినల్ క్లైమాక్స్ ని తెలుగు వెర్షన్ లో వేరే మార్చినట్టు కూడా తెలుస్తుంది. ముందు క్లైమాక్స్ తరుణ్ భాస్కర్ కి నచ్చలేదట. కానీ డైరెక్టర్ డెసిషన్ కి రెస్పెక్ట్ ఇస్తూ చేశాడట.

ఓం శాంతి శాంతి శాంతి సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జోడీ ఆకట్టుకునేలా ఉంది. ఓ విధంగా సినిమాకు ఈ ఇద్దరి పెయిర్ హైలెట్ అయ్యేలా ఉంది. సినిమాలో ఎలాగు కాన్ ఫ్లిక్ట్ పాయింట్ గురించి తెలిసిందే కాబట్టి దాన్ని తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా ఎలా కన్విన్స్ గా చెప్పారు అన్నది తెలియాల్సి ఉంది. తరుణ్ భాస్కర్ మాత్రం ఈ సినిమా కోసం తన బెస్ట్ ఎఫర్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈషా రెబ్బ కూడా చాలా కాలం తర్వాత లీడ్ రోల్ ఛాన్స్ అందుకుంది. అందుకే ఈ సినిమాలో ఆమె కూడా అదరగొట్టేసిందని అంటున్నారు.

తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా సత్తా చాటుతూనే..

జనవరి నెల ఆఖరుకి సరైన సినిమాలు లేవనుకుంటున్న టైం లో తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి శాంతి వస్తుంది. మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు కాబట్టి సినిమా ఏ రేంజ్ రీచ్ ఉంటుంది అన్నది చూడాలి. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా తన సత్తా చాటుతూనే యాక్టర్ గా కూడా వెరైటీ కథలతో ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు.

యువ డైరెక్టర్స్ లో తరుణ్ భాస్కర్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. అతను చేసింది తక్కువ సినిమాలే అయినా తరుణ్ సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ లో ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో ఒక బజ్ ఉంటుంది. ఆ పాపులారిటీ తోనే తనలో ఉన్న యాక్టర్ తో కూడా ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు తరుణ్ భాస్కర్.

Tags:    

Similar News