పవన్ 'జెన్ Z' మీట్.. ఇప్పుడు చిరు కూడా..

మెగా కుటుంబంలో స్పెషల్ ట్రెండ్ కనిపిస్తోంది. యూత్ ప్యాషన్ ను అర్థం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.;

Update: 2026-03-18 17:30 GMT

మెగా కుటుంబంలో స్పెషల్ ట్రెండ్ కనిపిస్తోంది. యూత్ ప్యాషన్ ను అర్థం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా మొదటి అడుగు పడింది. జనసేన పార్టీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, హైదరాబాద్‌ లో జనరేషన్ Z (Gen Z)కు చెందిన సుమారు 250 మంది యువతతో మీట్ నిర్వహించారు.

ఆ సమావేశంలో యువత రాజకీయాలపై ఏమనుకుంటున్నారు? వారి ఆశలు, అభిప్రాయాలు ఏమిటి? అన్న అంశాలపై చర్చించారు. ఆ కార్యక్రమం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా యూత్ అభిప్రాయాలు తెలుసుకోవడం ఎంత అవసరమో ఆ మీట్ స్పష్టం చేసింది. ఇదే దారిలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా నడవబోతున్నారని టాలీవుడ్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి.

సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న చిరంజీవి.. జెనరేషన్స్ కు తగ్గట్లు ఛేంజెస్ ను యాక్సెప్ట్ చేసే నటుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం సినిమాల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా జెన్ జెడ్ ఆడియన్స్ కథ, కథనం, ప్రెజెంటేషన్ విషయంలో కొత్తదనం కోరుకుంటున్నారు. సోషల్ మీడియా ఎఫెక్ట్, డిజిటల్ ప్లాట్‌ ఫార్మ్స్ వాడకం పెరగడంతో వారి టేస్టులు వేగంగా మారుతున్నాయి.

దీంతో చిరంజీవి కూడా యూత్ తో డైరెక్ట్ గా మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ప్రత్యేకంగా జెన్ జెడ్ ప్రేక్షకులతో ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ సమావేశంలో వారు ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారు? హీరో పాత్రలపై వారి అంచనాలు ఎలా ఉన్నాయి? అన్న అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది.

ఇటీవల టాలీవుడ్‌ లో వచ్చిన కొన్ని సినిమాలు యూత్ ను టార్గెట్ గా చేసుకుని భారీ విజయాలు సాధించాయి. మరోవైపు, పాత తరహా కథలు ఆశించిన రిజల్ట్స్ ఇవ్వకపోవడం కూడా గమనార్హం. ఈ నేపథ్యంలో చిరంజీవి తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారవచ్చు. తన ఫ్యూచర్ సినిమాల సెలెక్షన్ లో యువత అభిప్రాయాలకు తగ్గట్లు మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు హీరోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. కానీ నేరుగా కలుసుకుని చర్చించడం అరుదుగా జరుగుతుంది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమం కొత్త ట్రెండ్ ను చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే దారిలో చిరంజీవి అడుగులు వేస్తే, ఇది టాలీవుడ్‌ లో కొత్త ట్రెండ్‌ గా మారే అవకాశముంది. ఏదేమైనా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జెన్ జెడ్ ఇంటరాక్షన్ ప్రయోగం ఇప్పుడు సినిమాల వైపుకు విస్తరిస్తోందని చెప్పాలి. మెగాస్టార్ కూడా అదే ఫాలో అయితే.. యూత్ కు మరింత దగ్గరగా ఉండే సినిమాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News