ఉస్తాద్ రిజల్ట్.. ఎవరికి ఎంత హెల్ప్ చేస్తుంది?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో యంగ్ బ్యూటీస్ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఆ మూవీ హిట్ అవ్వడం ఎవరికి ఎంత ముఖ్యమో అనే చర్చ నెట్టింట జరుగుతోంది.
సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్న పవన్ విషయానికి వస్తే.. ఉస్తాద్ రిజల్ట్ ఆయన కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆయనకు వరుసగా సినిమాలు లైన్ లో ఉండటం వల్ల, ఒక సినిమా ఫలితం ఆయన మార్కెట్ ను ప్రభావితం చేసే అవకాశం తక్కువగా ఉంది. రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా ఆయనకు ఉన్న క్రేజ్ కొనసాగుతూనే ఉంటుంది.
అయితే ఇద్దరు హీరోయిన్లకు మాత్రం సినిమా విజయం చాలా కీలకం. ముఖ్యంగా శ్రీలీల పరిస్థితి ప్రస్తుతం కొంచెం క్లిష్టంగా ఉంది. ఇటీవల ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడం వల్ల, ఆమె కెరీర్ కు ఉస్తాద్ ఒక టర్నింగ్ పాయింట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టార్ హీరోల సరసన అవకాశాలు కొనసాగాలంటే, ఒక మంచి హిట్ ఆమెకు అవసరం.
ఇక రాశీ ఖన్నా విషయానికి వస్తే, ఆమె పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. తెలుగు సినిమాలతో పాటు హిందీ, ఓటీటీ ప్రాజెక్టుల్లో ఆమె బిజీగా ఉంది. ఫర్జీ వంటి వెబ్ సిరీస్ లతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఉస్తాద్ విజయం మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశముంది. అయితే సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, ఆమె కెరీర్ పై పెద్దగా ప్రభావం ఉండదని భావిస్తున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ కు మాత్రం ఉస్తాద్ అత్యంత కీలకంగా మారింది. ఆయన గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సాధించకపోవడం వల్ల, ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి హిట్ కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ వరుసగా హిట్లు ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో, పోటీ కూడా పెరిగింది. అందుకే ఉస్తాద్ విజయం ఆయన కెరీర్ కు కొత్త ఊపు ఇవ్వగలదు.
ఏదేమైనా ఉస్తాద్ రిజల్ట్ ప్రతి ఒక్కరికీ ఒకేలా ప్రభావం చూపదు. హీరోకి సాధారణ ప్రాజెక్ట్ అయితే, హీరోయిన్లకు కెరీర్ డిసైడ్ చేసే స్థాయిలో ఉంది. శ్రీలీలకు ఇది చాలా అవసరమైన హిట్ గా తెలుస్తోంది. దర్శకుడికి తన స్థానం నిలబెట్టుకునే కీలక అవకాశం. అందుకే ఉస్తాద్ విజయం కోసం ఇండస్ట్రీలోని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి మూవీ రిజల్ట్ ఎవరికి ఎంత మేలు చేస్తుందో తెలియాలంటే.. సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.