16 ఏళ్ల నిరీక్షణ.. ఒక్క సినిమాతో ఊహించని మార్కెట్!

దీనికి తోడు ప్రస్తుతం సెలబ్రిటీ కిడ్ అని చూడకుండా ఎవరైతే మంచి కంటెంట్ తో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తారో అలాంటి వారికే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.;

Update: 2026-01-27 05:55 GMT

సాధారణంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అంటే సామాన్య ప్రజలకు కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ సెలబ్రిటీల , పిల్లలకు ఏమంత కష్టం కాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి మంచి కథను, దర్శకుడిని, నిర్మాతను ఎంచుకుంటే చాలు ఆటోమేటిక్గా సినిమా మొదలవుతుంది. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సెలబ్రిటీ కిడ్స్ కి తమ తల్లిదండ్రుల వారసత్వం ఉపయోగపడినా.. కాలక్రమేనా తమ నటనతో వారు తమకు తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా సరే సరైన సక్సెస్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనికి తోడు ప్రస్తుతం సెలబ్రిటీ కిడ్ అని చూడకుండా ఎవరైతే మంచి కంటెంట్ తో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తారో అలాంటి వారికే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే ఇక్కడ ఒక సెలబ్రిటీ కిడ్ సుమారుగా 16 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి నటుడిగా అరంగేట్రం చేసినా ఇన్నేళ్లపాటు సరైన సక్సెస్ కోసం నిరీక్షించారు. అయితే తాజాగా వచ్చిన ఒక్క చిత్రం ఆయన కెరియర్ ను పూర్తిగా మార్చేసింది. అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటిటిలో కూడా ఆయనకు ఊహించని ఆదరణను అందిస్తోంది. మరి ఆ స్టార్ కి ఎవరో కాదు ఆది సాయికుమార్. విలక్షణ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు దక్కించుకున్న సాయికుమార్ వారసుడే ఆది సాయికుమార్.

2011లో 'ప్రేమ కావాలి' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతో ప్రేక్షకుల చేత యువ నటుడిగా కీర్తింపబడ్డాడు. పైగా విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. దక్షిణాది ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా లభించింది. ఆ తర్వాత వచ్చిన 'లవ్లీ' చిత్రంతో కూడా మంచి పేరు దక్కించుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు మాత్రం చూపించలేదు. ఇకపోతే థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా కలెక్షన్లు దక్కించుకోలేకపోయినా అవకాశాలకు మాత్రం కొరత ఏర్పడలేదు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా ఓటీటీలో మాత్రం భారీగా వ్యూస్ తెచ్చుకుంటూ తన సినిమాలతో కాలం వెళ్ళదీస్తూ వచ్చాడు.

ఒకానొక దశలో ఆది సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడం కూడా కష్టంగా అనిపించేది. అయితే అలాంటి ఆది సాయికుమార్ దాదాపు 16 ఏళ్ల తర్వాత "ఆది శంబాల" సినిమాతో థియేటర్లలో హిట్టు కొట్టి తన సత్తా చాటుకున్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్లపాటు కష్టపడిన ఆదికి సరైన సక్సెస్ లభిస్తే ఇక ఊరుకుంటాడా.. వరుస ప్రాజెక్టులతో రెచ్చిపోతాడు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇటు డిజిటల్ గా రిలీజ్ అయిదవ రోజుకే ఐదు కోట్ల వ్యూస్ రాబట్టింది. స్టార్ల సినిమాలకు మాత్రమే ఇలాంటి వ్యూయర్ షిప్ ఉంటుంది.

కానీ శంబాల ఆది కెరియర్ కు మంచి ఊపునిచ్చిన సినిమా అని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు ఈ ఒక్క సినిమా ఆది మార్కెట్ ను అమాంతం పెంచేసింది. ఇక భవిష్యత్తులో ఆదికి బిజినెస్ భారీగా జరిగే అవకాశాలు ఉన్నాయని.. ఈ సినిమా సంకేతాలు ఇచ్చిందని చెప్పవచ్చు. ఇన్నేళ్ల కష్టానికి ఒక్క సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు ఆది సాయికుమార్. ఇక భవిష్యత్తులో ఆయన మరిన్ని మంచి సినిమాలతో ఆకట్టుకోవాలని ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News