ఈ ఏడాది మిల్కీ బ్యూటీకి కలిసొచ్చేలా ఉందే!
మిల్కీ బ్యూటీ తమన్నా గత కొంతకాలంగా సరైన అవకాశం లభించక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.;
మిల్కీ బ్యూటీ తమన్నా గత కొంతకాలంగా సరైన అవకాశం లభించక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్పెషల్ సాంగ్ లు చేస్తూ వాటికే పరిమితం అయిపోతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యేలా చేసింది .ఇక ఇప్పుడు తాజాగా తన రూట్ మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఒక్కో అడుగు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మళ్లీ తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా కోలీవుడ్ లో సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా వస్తున్న 'పురుషన్' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'మొగుడు' అంటూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే ఇప్పుడు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఏకంగా ఇద్దరు స్టార్ హీరోల చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. తాజాగా బాలీవుడ్ మీడియా కథనాల నుండి వెలువడుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోలైన సంజయ్ దత్, అజయ్ దేవగన్ కాంబినేషన్లో వస్తున్న 'రేంజర్' అనే సినిమాలో తమన్నా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా హై వోల్టేజ్ సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు లవ్ రంజన్ నిర్మిస్తున్నారు. తమన్న పాత్ర శక్తివంతంగా అటు నటనకు ప్రాధాన్యత ఉండే పాత్ర కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
యాక్షన్ ఓరియంటెడ్ మూవీ గా వస్తున్న ఈ చిత్రంలో స్టార్ తారాగణం భాగమవుతుండడంతో రేంజర్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకట్టుకుంది. మరి ఇలాంటిలో సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో తమన్నా తిరిగి పూర్వ వైభవాన్ని అందుకుంటుందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఈమె.. ఇప్పుడు మళ్లీ ఆ స్టార్ స్టేటస్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ సినిమాతో తమన్నా తన పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకుంటుందో లేదో చూడాలి.
తమన్నా విషయానికి వస్తే.. 2005లో చాంద్ షా రోషన్ చెహ్రా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని ఆల్బమ్ సాంగ్స్ లో కనిపించిన ఈమె.. 2006లో శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అదే ఏడాది కేడీ సినిమాతో తమిళ సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. 2007లో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంతో తన కెరీర్ లో మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు.. అలా వరుసగా రామ్ చరణ్, అల్లు అర్జున్ , ప్రభాస్ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. అంతేకాదు ఒకానొక సమయంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా కూడా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో స్పెషల్ సాంగ్ లలో అలరిస్తున్న తమన్న మళ్లీ హీరోయిన్గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.