ట్రెడిషనల్ లుక్ లో అందంగా ముస్తాబైన త్రిష.. ఫోటోలు వైరల్

తెలుగు, తమిళ్ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అతి కొద్దిమంది నటీమణులలో త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.;

Update: 2026-03-14 19:30 GMT

తెలుగు, తమిళ్ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అతి కొద్దిమంది నటీమణులలో త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా .. ఇప్పటికీ చెరగని అందంతో.. వరుస ఆఫర్లతో బిజీగా మారింది. ఇక అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో స్టార్ సీనియర్ హీరోల చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా నయనతారతో అప్పటికీ ఇప్పటికీ పోటీ పడుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్గా నటించిన త్రిష.. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.



 


వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు..

ఇదిలా ఉండగా మరొకవైపు కోలీవుడ్ హీరో విజయ్ తో రిలేషన్ లో ఉందనే వార్తలను విపరీతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయంపై అటు కోలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు పలువురు నటులు కూడా వీరి బంధం పై కామెంట్లు చేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో తలదూర్చడంతో అటు విజయ్ ను రాజకీయంగా తొక్కేయడానికి త్రిషను అడ్డం పెట్టుకొని కామెంట్లు చేస్తున్నారు అనే వార్తలు తమిళ తంబీల నుంచి కూడా వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా త్రిష - విజయ్ మధ్య స్నేహబంధం ఉన్నప్పటికీ ఏదో ఉందనే రూమర్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.



 


విమర్శల వేళ చెరగని నువ్వు..

దీనికి తోడు సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వస్తున్న సమయంలో త్రిష - విజయ్ ఇద్దరు కలిసి ఇటీవల ఒక పెళ్లి వేడుకలు మళ్లీ జంటగా కనిపించి రూమర్లకు మరింత ఆజ్యం పోశారు.అలా ఈ మధ్య వ్యక్తిగతంగా మరిన్ని విమర్శలు ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే అనవసరపు మాటలను పట్టించుకోవడం అంటే సమయాన్ని వృధా చేసినట్టే అని త్రిష భావించినట్టు ఉంది. అందుకే కాబోలు ఇలా తన పని తాను చేసుకుంటూ మరింత సంతోషంగా గడుపుతోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు



 


పట్టుచీరలో సాంప్రదాయంగా ఆకట్టుకుంటున్న త్రిష..

ఇకపోతే ఎన్ని విమర్శలు వచ్చినా తనకేమీ పట్టనట్టు సోషల్ మీడియాలో బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అభిమానుల హృదయాలు దోచుకుంది ఒక జ్యువెలరీ సంస్థ ప్రమోషన్ లో భాగంగా అందమైన జ్యువెలరీని ధరించి పట్టుచీరలో సాంప్రదాయంగా మరింత మెరిసిపోయింది ఈ చెన్నై చిన్నది. కాటుక కళ్ళతో మైమరిపిస్తూ త్రిష తాజాగా షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతూ 40 దాటినా అందానికి కొదవలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ విశేషమేమిటంటే.. ముఖ్యంగా వ్యక్తిగతంగా ఎన్ని ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్నప్పటికీ తాజాగా షేర్ చేసిన ఫోటోలలో త్రిష చాలా సంతోషంగా కనిపించడంతో నిటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మిస్ బ్యూటిఫుల్ స్మైల్ నుంచి స్టార్ హీరోయిన్ గా..

త్రిష కెరియర్ విషయానికి వస్తే.. ప్రశాంత్ - సిమ్రాన్ కాంబినేషన్లో వచ్చిన జోడి సినిమాలో సిమ్రాన్ స్నేహితురాలి పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర ద్వారా కెరియర్ మొదలుపెట్టిన త్రిష.. తెలుగులో తొలిసారి ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో, నటనతో మెప్పించిన త్రిష.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది . ఇండస్ట్రీలోకి రాకముందు అందాల పోటీలలో కూడా పాల్గొన్న ఈమె మిస్ చెన్నైగా ఎంపిక అయింది. ఆ తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో కూడా పాల్గొనింది. పైగా మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా కిరీటాన్ని సొంతం చేసుకుంది త్రిష.

Tags:    

Similar News