శ్రీకాంత్ ఓదెల స్టైల్ ఏంటి? ఆయన మేకింగ్ కి ఇన్స్పిరేషన్ ఎవరు? అందుకే ప్యారడైజ్ తీశాడా?

ఈ సినిమా కథను అదిలాబాద్ లోని కొన్ని రియాలెస్టిక్ సంఘటనల ఆధారంగా, అలాగే ఒకప్పుడు సికింద్రాబాద్ లోని కొంతమంది పీడిత వర్గాలను ఆధారంగా చేసుకొని ఈ కథనైతే రాసుకున్నట్టుగా తెలియజేశాడు.

Update: 2026-09-20 08:30 GMT

సినిమాలను చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఒక వర్గానికి చెందిన వారయితే, కొన్ని మూవీస్ ను చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా సినిమాలు తీయాలి అనే కసితో ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టేవారు మరొక రకం... వాళ్లు చూసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి దర్శకుడు ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది నేర్చుకునే ప్రయత్నంలో అప్ కమింగ్ డైరెక్టర్స్ చాలావరకు కష్టపడుతుంటారు. ఇక అందులో భాగంగానే సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన 'శ్రీకాంత్ ఓదెల' గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి సినిమాలకి సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన శ్రీకాంత్ ఓదెల 'దసర' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'ప్యారడైజ్' సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈనెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో మేకర్స్ బిజీ గా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓదల స్టైల్ ఏంటి ఆయన ఏ టైప్ ఆఫ్ సినిమాలను చేయగలుగుతాడనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. నిజానికి దసర సినిమాతో డార్క్ షేడ్స్ ఉన్న కథలను పెర్ఫెక్ట్ గా డీల్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన సినిమాల్లో ఒక రా నెస్ కనిపిస్తుంది...

ఇక మేకింగ్ విషయంలో కూడా ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ ని మెయింటైన్ చేస్తుంటాడు. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వెట్రీ మారన్, బాలా, పా రంజిత్, సెల్వ రాఘవన్ లాంటి దర్శకుల సినిమాలను శ్రీకాంత్ ఓదెల ఎక్కువగా చూస్తు పెరిగాడని అందువల్లే ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి తను అడిక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక తెలుగులో సుకుమార్ అంటే తనకు చాలా ఇష్టమని అందుకే అతని దగ్గర దర్శకత్వం విభాగంలో పనిచేశానని పలు సందర్భాల్లో చెప్పాడు. సుకుమార్ స్టైల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కూడా శ్రీకాంత్ మూవీస్ లో కనిపిస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ప్రేక్షకుడికి నచ్చే సినిమా చేయడానికి చాలా వరకు కష్టపడుతుంటాడు. ఇక ప్యారడైజ్ సినిమాలో 'సవారి' అనే ఒక గ్యాంగ్ ను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా కథను అదిలాబాద్ లోని కొన్ని రియాలెస్టిక్ సంఘటనల ఆధారంగా, అలాగే ఒకప్పుడు సికింద్రాబాద్ లోని కొంతమంది పీడిత వర్గాలను ఆధారంగా చేసుకొని ఈ కథనైతే రాసుకున్నట్టుగా తెలియజేశాడు. మొత్తానికైతే శ్రీకాంత్ ఓదల ఇప్పుడు టాప్ డైరెక్టర్ గా మారడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఆయన ప్యారడైజ్ తో కనుక సక్సెస్ ని సాధిస్తే తన ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరనేది వాస్తవం... ఇప్పటివరకు ఆయన చేసింది ఒక్క సినిమానే అయినా అంతటి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నారంటే మామూలు విషయం కాదు. సుకుమార్ లాంటి దర్శకుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన శ్రీకాంత్ ఓదెల 'జగడం' సినిమా అతన్ని పూర్తిగా మార్చేసిందని తను కూడా ఫిలిం మేకర్ అవ్వాలని ఆ సినిమా చూశాకే డిసైడ్ అయినట్టుగా శ్రీకాంత్ తన ఇంటర్వ్యూలో తెలియజేశాడు...

Tags:    

Similar News