బిగ్ బాస్ కే కండీష‌న్లు పెట్టిన న‌యా స్టార్!

కెరీర్ ప్రారంభంలో కొన్ని ప్రత్యేక పాటల్లో నటించినా? దానికి సంబంధించిన పారితోషికం త‌న‌కు సకాలంలో అందలేదని నోరా తెలిపారు.

Update: 2026-09-20 09:30 GMT

బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అయితే ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నోరా కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు .. బిగ్ బాస్ 9 రియాలిటీ షోలోకి అడుగుపెట్టడానికి దారితీసిన పరిస్థితుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 2015 డిసెంబర్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి నోరా విధించిన షరతు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

కెరీర్ ప్రారంభంలో కొన్ని ప్రత్యేక పాటల్లో నటించినా? దానికి సంబంధించిన పారితోషికం త‌న‌కు సకాలంలో అందలేదని నోరా తెలిపారు. ప్రొడ్యూసర్లు ఏజెన్సీలకు డబ్బులు చెల్లించినా? తన వద్దకు ఆ సొమ్ము చేరక పోవడంతో డబ్బుల కోసం ఏజెన్సీలతో పోరాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అలా సంపాదించిన సొమ్ము రాక, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే తనకు బిగ్ బాస్ షో నుంచి పిలుపు వచ్చిందని వెల్లడించారు. మొదట్లో రియాలిటీ షోల పట్ల తనకు మంచి అభిప్రాయం లేదని.. అందుకే బిగ్ బాస్ ప్రతిపాదనను తిర స్కరించాలని భావించినట్లు నోరా తెలిపారు.

అయితే మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పాటు.. ఆ ఛానెల్‌తో ఓ ఒప్పందానికి వచ్చానన్నారు. డ్యాన్స్ రియాలిటీ షో `జలక్ దిఖ్లా జా` లో పాల్గొనాలనేది తన అసలు కోరిక అని.. ఆ షోలో అవకాశం ఇస్తేనే బిగ్ బాస్‌కు వస్తానని షరతు విధించానని.. దానికి నిర్వాహకులు అంగీకరించడంతోనే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టానని వెల్లడించారు. బిగ్ బాస్ 9లో మూడు వారాల పాటు మాత్రమే ఉన్నా? ఆ షో ద్వారా నోరా ఫతేహి ప్రతి ఇంట్లోనూ సుపరిచితమైన ముఖంగా మారారు. ఈ షో సమయంలోనే తోటి కంటెస్టెంట్, ఆ సీజన్ విజేత అయిన ప్రిన్స్ నరులాతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత తాను అనుకున్నట్లే `జలక్ దిఖ్లా జా` షోలో కూడా పాల్గొని అద్భుతమైన డ్యాన్స్ ప్రతిభతో అందరినీ మైమరిపించారు.

బిగ్ బాస్ నుంచి ప్రారంభమైన నోరా ప‌టేహీ ప్రయాణం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇటీవల జరిగిన ఫీఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తన ప్రదర్శనతో గ్లోబల్ వేదికపై మెరిశారు. అలాగే సంజోయ్ - వెజెడ్రీ మ్‌లతో కలిసి ఫీఫా 2026 అధికారిక పాట `సీర్ సీర్` లో కూడా భాగమయ్యారు. ప్రస్తుతం వరుస అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నోరా ఫతేహి నూతన ఈపీ `ప్లే` నుంచి `స్లే టు ది రిథమ్` పాటను విడుదల చేశారు. అంతకుముందు బాద్‌షాతో కలిసి చేసిన `సాజన్ రే` పాటకు కూడా మంచి ఆదరణ లభించింది. త్వరలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ న‌టిస్తోన్న `జైల‌ర్ 2` చిత్రంలో అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌లో హాట్ బ్యూటీ అలరించనున్నారు.

Tags:    

Similar News