దుబాయ్‌లో బాంబులు వేస్తుంటే.. ఫుకెట్‌లో ఎంజాయ్ చేస్తోంది!
నటాషా ఇటీవల థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో ఉన్న ఒక విలాసవంతమైన రిసార్ట్‌లో గడుపుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసారు.;
మోడల్ కం నటి నటాషా స్టాంకోవిచ్ తన వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను పక్కన పెట్టి ప్రస్తుతం వెకేషన్ మూడ్‌లో విహరిస్తున్నారు. హార్దిక్ పాండ్యాతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ బ్యూటీ తాజాగా గల్ఫ్ రీజియన్‌లోని అందమైన తీర ప్రాంతాల్లో సేదతీరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు కొనసాగుతున్నా కానీ.. అవేవీ తన ప్రశాంతతకు ఆటంకం కలిగించవన్నట్లుగా ఆమె ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు రాత్రికి దుబాయ్ (ఫుకెట్ కి 300కి.మీల దూరం) పై బాంబులు, మిసైల్స్ తో విరుచుకుపడతామని ఇరాన్ ప్రకటించినా ఆ టెన్షన్ తనకు ఏమాత్రం కలగలేదు.
నటాషా ఇటీవల థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో ఉన్న ఒక విలాసవంతమైన రిసార్ట్‌లో గడుపుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసారు. ``ది లేజీ కోకోనట్ ఫుకెట్ వద్ద నా చిన్న స్వర్గాన్ని కనుగొన్నాను`` అంటూ ప్రకృతి ఒడిలో తాను పొందుతున్న ఆనందాన్ని వివరించారు. ఈ ఫోటోలలో సముద్రపు తీరాన, కొబ్బరి చెట్ల నీడలో ఎంతో ఉల్లాసంగా కనిపిస్తున్నారు. తన కుమారుడు అగస్త్యతో కలిసి ఆమె ఈ విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పూల్ - బీచ్ వైబ్స్‌లో నటాషా పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నీలి రంగు సముద్రపు నీరు, తెల్లటి ఇసుక తిన్నెల మధ్య ఆమె గ్లామరస్ లుక్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ వద్ద ఆమె దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన ఫిట్‌నెస్ , స్టైలిష్ దుస్తులతో ఆమె మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌ను చాటుకున్నారు.
గత కొద్ది కాలంగా హార్దిక్ పాండ్యాతో విడాకుల వ్యవహారం కారణంగా నటాషా సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే వాటన్నింటికీ సమాధానం అన్నట్లుగా తన పర్సనల్ లైఫ్‌ను ఎంతో పాజిటివ్‌గా లీడ్ చేస్తున్నారు. ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు ఇలాంటి వెకేషన్స్ అవసరమని నటాషా నమ్ముతున్నారు. ఆమె ధైర్యాన్ని.. ఆత్మవిశ్వాసాన్ని చూసి అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కేవలం గ్లామర్ కోణంలోనే కాకుండా.. ఒక ఒంటరి తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవడం ఆమె ప్రత్యేకత. ఫుకెట్‌లోని ఆ ప్రశాంత వాతావరణం తన మనసుకు ఎంతో హాయిని ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. యుద్ధ టెన్షన్లు లేదా వ్యక్తిగత గొడవలకు తావు లేకుండా.. ప్రకృతితో మమేకమై ఆమె గడుపుతున్న తీరు ఆదర్శవంతంగా ఉంది.
మొత్తానికి నటాషా స్టాంకోవిచ్ తన ఫుకెట్ వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. వెండితెరపై తదుపరి ప్రాజెక్టుల కోసం అభిమానులు ఎదురుచూస్తుండగానే..నటాషా మాత్రం ప్రస్తుతానికి మినీ స్వర్గంలో తన కాలాన్ని గడుపుతున్నారు. ఆమె ఇన్ స్టా పోస్టులు చూస్తుంటే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాధించాలనే సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా కేవలం 3000 మైళ్ల దూరంలో ఉన్న దుబాయ్ పై భీకర దాడికి ఇరాన్ సిద్ధమవుతుంటే నటాషా ఇంత ధీమాగా ఎలా ఉందో అర్థం కావడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.