త‌మిళ ప్రొడ్యూస‌ర్స్‌లో కొత్త టెన్ష‌న్‌!

కోలివుడ్ ప్రొడ్యూస‌ర్ల‌కు ఒక ద‌శ‌లో భారీ లాభాల్ని అందించే మార్కెట్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఉండేది. అక్క‌డ విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకున్న సినిమాలకు ఇక్క‌డ భారీ డ‌బ్బింగ్ రైట్స్ ల‌భించేవి.;

Update: 2026-03-14 18:30 GMT

కోలివుడ్ ప్రొడ్యూస‌ర్ల‌కు ఒక ద‌శ‌లో భారీ లాభాల్ని అందించే మార్కెట్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఉండేది. అక్క‌డ విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకున్న సినిమాలకు ఇక్క‌డ భారీ డ‌బ్బింగ్ రైట్స్ ల‌భించేవి. అంతే కాకుండా రీమేక్ రైట్స్ రూపంలోనూ భారీ మొత్త‌మే అందుకునేవారు. కానీ పాన్ ఇండియా సినిమాల ప్ర‌వాహం, ఓటీటీల ప్ర‌భావం మొద‌లైన దగ్గ‌రి నుంచి వారికి ఈ మార్గెట్ విష‌యంలో పెద్ద గండి ప‌డింది. అయినా స‌రే త‌మిళంలో నిర్మించిన సినిమాల‌ని తెలుగులో డ‌బ్ చేసి కాస్త అటు ఇటుగా రిలీజ్ చేయాల‌ని చూసినా క‌లిసి రావ‌డం లేదు.

దీంతో త‌మిళ ప్రొడ్యూస‌ర్ల‌లో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. దానికి ప్ర‌ధాన కార‌ణం ఇటీవ‌ల విడుద‌లై ఆశించిన ఫ‌లితాల్ని రాబ‌ట్ట‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద చేతులెత్తేసిన సినిమాలే. `టూరిస్ట్ ఫ్యామిలీ` డైరెక్ట‌ర్ అభిషిన్ జీవింత్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ నిర్మించిన మూవీ `విత్ ల‌వ్‌`. దీన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. అయితే త‌మిళ‌నాడులో రూ.30 కోట్ల‌కు పైనే రాబ‌ట్టిన ఈ సినిమా తెలుగులో మాత్రం రెండు కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది.

ఇక రీసెంట్ గా రాధిక శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో క్రేజీ హీరో శివ‌కార్తికేయ‌న్ `తాయ్ కిళ‌వి`ని నిర్మించాడు. ప‌క్కా త‌మిళ నేటివిటితో గ్రామీణ వాతావ‌ర‌ణం నేఫ‌థ్యంలో రూపొందిన ఈ సినిమా అక్క‌డ రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు మేక‌ర్స్‌ని షాక్‌కు గురి చేసింది. కేవ‌లం రూ.10 కోట్ల‌తో నిర్మిస్తే రూ.50 కోట్ల‌కు మించి క‌లెక్ష‌న్‌లు సాధించింది. దీంతో ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ దీన్ని తీసుకోవ‌డానికి తెలుగులో ఏ ప్రొడ్యూస‌ర్ కూడా సాహ‌సించ‌డం లేదు.

గ‌తంలో కామెడీ నేప‌థ్యంలో సాగే ల‌వ్‌స్టోరీల‌కు, యాక్ష‌న్ డ్రామాల‌కు తెలుగులో మంచి ఆద‌ర‌ణ ఉండేది. ప్రొడ్యూస‌ర్స్ కూడా వీటిని రిలీజ్ చేయ‌డానికి పోటీప‌డేవారు. కానీ ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో త‌మిళ ప్రొడ్యూస‌ర్లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. చిన్న సినిమాలే కాకుండా పేరున్న హీరోలు న‌టించిన భారీ చిత్రాల‌కు కూడా ఇదే ప‌రిస్థితి ఎదుర‌వుతుండ‌టంతో త‌మిళ ప్రొడ్యూస‌ర్స్‌లో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది.

కార్తి హీరోగా న‌టించిన `వా వ‌తియార్‌` మూవీని తెలుగులో `అన్న‌గారు వ‌స్తున్నారు`గా రిలీజ్ చేశారు. రూ.40 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ అక్క‌డ కేవ‌లం రూ.10 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టి షాక్ ఇచ్చింది. తెలుగులోనూ పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేదు. ఇక దీనికి ముందు విడుద‌లైన శివ కార్తికేయ‌న్ `ప‌రాశ‌క్తి` కూడా త‌మిళంలో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. రూ.150 కోట్లు ఖ‌ర్చు చేస్తే అక్క‌డ కేవ‌లం రూ.100 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టింది. తెలుగులో అయితే ఎలాంటి సౌండ్ చేయ‌లేక‌పోయింది. దీంతో త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌పై తెలుగు నిర్మాత‌ల్లో ఆస‌క్తి త‌గ్గుతుండ‌టంతో త‌మిళ ప్రొడ్యూస‌ర్స్‌లో కొత్త టెన్ష‌న్‌ప‌డుతున్నార‌ట.

Tags:    

Similar News