అభిమానుల ఎదురు చూపులకు తెర, ఇదిగో డేట్‌

కేజీఎఫ్‌ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్‌ ప్రస్తుతం 'టాక్సిక్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Update: 2026-08-01 07:32 GMT

కేజీఎఫ్‌ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్‌ ప్రస్తుతం 'టాక్సిక్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కేజీఎఫ్‌ సిరీస్‌ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న యశ్‌ ఫైనల్‌గా రెట్రో క్లాసికల్ గ్యాంగ్‌స్టర్ మూవీ 'టాక్సిక్‌' కి ఓకే చెప్పడం అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. పైగా మలయాళ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ గీతూ మోహన్‌ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సినిమాను హాలీవుడ్‌ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా నిర్మించినట్లుగా మొదటి నుంచి మేకర్స్ చెబుతూ వస్తున్నారు. దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్ ఈ సినిమా విషయంలో తన పంథాను పూర్తిగా పక్కన పెట్టి, యశ్‌ స్టైల్‌లో, ఆయన మార్క్‌ యాక్షన్‌ సీన్స్‌తో, ప్రేక్షకులు ఆయన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా టాక్సిక్‌ సినిమాను రూపొందించినట్లుగా యూనిట్‌ సభ్యులు పలు సందర్భాల్లో చెప్పడం మనం చూశాం.




 


యశ్‌ టాక్సిక్ సినిమా కోసం...

యశ్‌ అభిమానులతో పాటు, దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'టాక్సిక్‌' సినిమాను అదుగో ఇదుగో అంటూ గత ఆరు నెలలుగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. సినిమాను మొదట వెంటనే విడుదల చేయాలని భావించినప్పటికీ మేకింగ్‌ విషయంలో చాలా ఆలస్యం అయింది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్ కోసం యశ్‌ చాలా రిస్క్‌ తీసుకున్నాడని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. విడుదల అయిన తర్వాత కూడా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కి, రీ రికార్డింగ్‌ కి చాలా సమయం తీసుకుంది. దాంతో సినిమాను పలు సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ మధ్య ఒక పెద్ద సినిమా పోటీ వల్ల వాయిదా వేశారనే వార్తలు వచ్చాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ బెటర్‌మెంట్‌ చేస్తూనే వచ్చారని తెలుస్తోంది. ఫైనల్‌గా టాక్సిక్‌ మంథ్‌ వచ్చేసిందని యశ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టాక్సిక్‌ ట్రైలర్ రిలీజ్‌ డేట్‌...

కన్నడ, తెలుగు, హిందీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ దేశ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న టాక్సిక్‌ మూవీని ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు వచ్చి అంచనాలు పెంచాయి. పాటలకే ఈ రేంజ్‌ క్రేజ్ వస్తే ఇక ట్రైలర్‌ వస్తే ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా ట్రైలర్‌ కి డేట్‌ కన్ఫర్మ్‌ అయింది. ఆగస్టు 8న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. అందుకోసం టాక్సిక్‌ నుంచి ఒక పోస్టర్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలు మరింతగా పెంచారు. ట్రైలర్‌ రిలీజ్‌ పోస్టర్‌లో యశ్‌ ను చూస్తుంటే పిచ్చెక్కి పోతుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఒక సౌత్‌ మూవీకి ఈ స్థాయి బజ్‌ క్రియేట్‌ కావడం ఇదే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కన్నడ స్టార్‌ యశ్‌ టాక్సిక్‌ తెలుగులో...

వర్షంలో తడుస్తున్న యశ్‌ ను బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో చాలా స్టైలిష్‌గా, వైల్డ్‌గా చూపించడం ద్వారా టాక్సిక్‌ ను మరోసారి వార్తల్లో మేకర్స్‌ నిలిపారు. ట్రైలర్‌ విడుదల తర్వాత మొత్తం టాక్సిక్‌ వ్యవహారం మారిపోతుందని, ఇప్పటి వరకు చిన్న చిన్న అనుమానాలు ఏమైనా ఉంటే వాటిని పటాపంచలు చేసే విధంగా ట్రైలర్ ఉండబోతుందని కన్నడ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సినిమా కన్నడం లో రూపొందినా కచ్చితంగా హిందీలో అత్యధిక వసూళ్లు నమోదు చేస్తుందని కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక టాక్సిక్ సినిమాకు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ పెద్ద పోటీ సినిమాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. దాంతో కనీసం రెండు వారాలు టాక్సిక్‌ బాక్సాఫీస్‌ ప్రభంజనం కొనసాగే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News