ఆ న‌లుగురి స్ట్రైక్ రేట్ మామూలుగా లేదుగా!

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కు మాత్ర‌మే ప్ర‌ధాన ప్రియారిటీ ఇస్తార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అది ఉంటేనే ఇక్క‌డ విలువ‌. వ‌న్స్ అది చేజారిందో ఇక్క‌డ ప‌ట్టించుకునే వారే ఉండ‌రు.;

Update: 2026-03-14 22:30 GMT

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కు మాత్ర‌మే ప్ర‌ధాన ప్రియారిటీ ఇస్తార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అది ఉంటేనే ఇక్క‌డ విలువ‌. వ‌న్స్ అది చేజారిందో ఇక్క‌డ ప‌ట్టించుకునే వారే ఉండ‌రు. క‌నీసం ఫోన్ ఎత్తేవారే ఉండ‌రు. అలాంటి స‌క్సెస్‌ని 100 ప‌ర్సంట్ స్ట్రైక్ రేట్‌తో త‌మ వెంటె పెట్టుకుని ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన డైరెక్ట‌ర్స్ కొంద‌రే ఉన్నారు. వారిలో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేర్లు నాలుగే నాలుగు. ఎవ‌రా న‌లుగురు? ఏంటీ వాళ్ల క‌థ అన్న‌ది ఇప్పుడు చూద్దాం.

ఈ రేసులో ముందు వ‌రుస‌లో ఉన్న డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. జ‌క్క‌న్న‌గా అంతా పిలుచుకునే రాజ‌మౌళి స్టూడెంట్ నెం.1 నుంచి ఆర్ఆర్ఆర్ వ‌ర‌కు 12 స‌క్సెస్‌ల‌తో ముందు వ‌రుస‌లో నిలిచారు. `స్టూడెంట్ నెం.1`కు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేసినా ఆ మూవీ ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ రాజ‌మౌళి మార్కు క‌నిపించింది. ఇక అక్క‌డి నుంచి సింహాద్రి, నితిన్‌తో `సై`, ప్ర‌భాస్‌తో `ఛ‌త్ర‌ప‌తి`, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో `విక్ర‌మార్కుడు`, ఎన్టీఆర్‌తో `య‌మ‌దొంగ‌`, రామ్ చ‌ర‌ణ్‌తో `మ‌గ‌ధీర‌`, సునీల్‌తో `మ‌ర్యాద రామ‌న్న‌`, నాని, స‌మంత‌ల‌తో ప్ర‌యోగాత్మ‌కంగా `ఈగ‌`

పాన్ ఇండియా ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుడుతూ ప్ర‌భాస్ - రానాల‌తో చేసిన `బాహుబ‌లి ది బిగినింగ్‌, బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో అత్యంత భారీ స్థాయిలో చేసిన `ఆర్ఆర్ఆర్‌`వంటి సినిమాల‌తో వ‌రుస‌గా 12 స‌క్సెస్‌ల‌ని ద‌క్కించుకుని అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా రికార్డుని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మ‌హేష్‌తో చేస్తున్న `వార‌ణాసి` 13వ సినిమా. ఇది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే ద‌ర్శ‌కుడిగా మరో రికార్డుని జ‌క్క‌న్న న‌మోదు చేయ‌డం ఖాయం.

ఆ త‌రువాత స్థానంలో నిలిచిన ద‌ర్శ‌కుడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి. `ప‌టాస్‌`తో మొద‌లైన అనిల్ ప్ర‌యాణం అప్ర‌తిహ‌తంగా సాగుతోంది. సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో చేసిన `సుప్రీమ్`, ర‌వితేజ `రాజా ది గ్రేట్‌`, వెంకీ, వ‌రుణ్‌ల‌తో `ఎఫ్ 2`, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో `స‌రిలేరు నీకెవ్వ‌రు`, వెంకీ, వ‌రుణ్‌ల‌తో `ఎఫ్ 3`, నంద‌మూరి బాల‌య్య‌తో `భ‌గ‌వంత్ కేస‌రి`, వెంకీ మామ‌తో `సంక్రాంతికి వ‌స్తున్నాం`, మెగాస్టార్‌తో `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` వంటి వ‌రుస హిట్‌లు, సూప‌ర్ హిట్‌లు, బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని అందించారు. ఈయ‌న ఖాతాలో ఇప్ప‌టికి 9 హిట్లున్నాయి.

వీరి త‌ర‌హాలోనే సందీప్‌రెడ్డి వంగ కూడా ఎక్క‌డా త‌గ్గేదేలే అన్న‌ట్టుగా వ‌రుస పాథ్ బ్రేకింగ్ మూవీస్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని అందిస్తున్నాడు. అర్జున్ రెడ్డితో ఇండ‌స్ట్రీని షేక్ చేసిన సందీప్ అదే మూవీ రీమేక్‌తో బాలీవుడ్‌ని ద‌డ‌ద‌డ‌లాడించ‌డం తెలిసిందే. ఇక ర‌ణ్‌బీర్‌తో చేసిన `యానిమ‌ల్‌` చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం త‌న నాలుగ‌వ మూవీగా `స్పిరిట్‌` చేస్తున్నాడు. దీంతో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్‌కి మించి ఆశిస్తున్నాడు. ప్ర‌భాస్ హీరో కావ‌డంతో అది సాధ్య‌మే అనే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

శేఖ‌ర్ క‌మ్ముల శిష్యుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన నాగ్ అశ్విన్ తొలి ప్ర‌య‌త్నంలోనే `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` మూవీతో అందరిని ఆలోచింప‌జేశాడు. ఆ త‌రువాత చేసిన సావిత్రి బ‌యోపిక్ `మ‌హాన‌టి` ఏస్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుందో అంద‌రికి తెలిసిందే. `మ‌హాన‌టి` త‌రువాత క‌లియుగానికి, భ‌విష్య‌త్తుకు లింక్ చేస్తూ దేవుడి రాక‌ని తెలియ‌జేస్తూ రూపొందించిన సైన్స్ ఫిక్ష‌న్ `క‌ల్కి 2898 ఏడీ`. హేమా హేమీలు ప్ర‌భాస్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్‌, శోభ‌న‌, దీపిక ప‌దుకునే, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ త‌దిత‌రులు న‌టించిన ఈ పాన్ ఇండియా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1000 కోట్ల‌కు పైనే రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు 4వ సినిమాగా `క‌ల్కి` సీక్వెల్‌ని రూపొందిస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా ఇప్ప‌టి వ‌ర‌కు 3 హిట్స్‌ని త‌న ఖాతాలో వేసుకున్న నాగ్ అశ్విన్ `క‌ల్కి` సీక్వెల్‌తో మ‌రో రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకునే ప‌నిలో ఉన్నాడు. ఈ డైరెక్ట‌ర్స్ వ‌రుస స‌క్సెస్‌ల‌తో హండ్రెడ్ ప‌ర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో విజ‌య‌వంతంగా వ‌రుస స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకుంటుండ‌టం విశేషం.

Tags:    

Similar News