పెళ్లి వేడుకల్లో సెలబ్రిటీలు ఉపయోగించిన మేకప్ ఖరీదు ఎంతో తెలుసా? హైయెస్ట్ ఎవరంటే?
ఈ క్రమంలోనే ఇండియన్ సెలబ్రిటీస్ లలో టాప్ టెన్ లో అత్యంత ఖరీదైన మేకప్ ను ఉపయోగించిన సెలబ్రిటీలు ఎవరు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి;
ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పటి అమ్మాయిలు ఇంట్లో ఉన్నా.. బయటకు రావాలన్నా కచ్చితంగా ముఖం మీద మేకప్ ఉండాల్సిందే. మేకప్ లేకుండా బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువే. ముఖ్యంగా మేకప్ అనేది అమ్మాయి అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే సాధారణంగా బయటకు రావాలంటేనే మేకప్ వేసుకునే అమ్మాయిలు.. తమ జీవితంలో అత్యంత మధురగట్టమైన పెళ్లి వేడుకల్లో ఇంకెలా ముస్తాబవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యులే తమ పెళ్లి వేడుకను అత్యంత హుందాగా జరుపుకుంటే.. ఇక సెలబ్రిటీలు ఇంకెంత ఘనంగా జరుపుకుంటారో ఊహించుకోవచ్చు.
అందులో సినిమా సెలబ్రిటీలు కొంతమంది తమ పెళ్లి వేడుకలను అత్యంత సింపుల్ గా జరుపుకున్నా.. ఆ పెళ్లి వేడుక చాలా లగ్జరీగా ఉండడానికి ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి వివాహాన్ని తీసుకోవచ్చు. వీరు కేవలం 100 మంది అతిధులు, సన్నిహితుల సమక్షంలో ఉదయపూర్ లో వివాహం చేసుకున్నారు.. వీరి పెళ్లి కొద్ది మంది సమక్షంలో సింపుల్ గా జరిగినా.. వీరు మాత్రం తమ పెళ్ళికి ఉపయోగించిన వస్తువులు , ఆభరణాలు, దుస్తుల ఖరీదే కోట్లల్లో ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక రష్మిక మందన్న మాత్రమే తన మేకప్ కోసం ఏకంగా రెండు కోట్లు ఉపయోగించిందని తెలిసి నివ్వెరపోతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ సెలబ్రిటీస్ లలో టాప్ టెన్ లో అత్యంత ఖరీదైన మేకప్ ను ఉపయోగించిన సెలబ్రిటీలు ఎవరు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.. మేకప్ కోసం నేషనల్ క్రష్ 2 కోట్లు..
తమ జీవితంలో మొదలయ్యే కొత్త అధ్యాయాన్ని మరింత సంతోషంగా, లగ్జరీగా స్వాగతించడానికి సెలబ్రిటీలు కూడా భారీగానే ఖర్చుపెట్టారు. ఇక తమ మేకప్ కోసం ఎక్కువ ఖర్చు చేశారు..? ఎవరు ఏ ఏ స్థానాలలో నిలిచారు ? అనే విషయానికి వస్తే.. నంబర్ వన్ స్థానంలో నిలిచింది రష్మిక మందన్న.. తన దుస్తులతో, మేకప్ తో, ఆభరణాలతో అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈమె తన మేకోవర్ కోసం ఏకంగా 2 కోట్లు ఖర్చుపెట్టింది.
అభిషేక్ తో పరిణయం మహారాణిలా ఐశ్వర్యరాయ్..
తన ప్రేమికుడు అభిషేక్ బచ్చన్ తో వివాహానికి సిద్ధమైనప్పుడు ఐశ్వర్యరాయ్ తన మేకప్ కోసం ఏకంగా 75 లక్షలు ఉపయోగించింది. ముఖ్యంగా ఆమె వివాహ సమయంలో ఆమె వేసుకున్న జ్యువెలరీ , ధరించిన దుస్తులు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి.
సింపుల్ లుక్ తో కాస్ట్లీగా కనిపించిన అలియా భట్..
సాధారణంగా అలియా భట్ సింపుల్ గా కనిపిస్తుంది. కానీ ఆమె ధరించే వస్తువుల ఖరీదు తెలిస్తే మాత్రం ఆమె లగ్జరీని చూపెడుతుంది. అలా తన ప్రియుడు రణబీర్ కపూర్ తో ఏడడుగులు వేసేటప్పుడు పెళ్లిలో చాలా సింపుల్ గా అందంగా తయారయింది కానీ తాను ఉపయోగించిన మేకప్ ఖరీదు రూ.50 లక్షలు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
జ్యూవెలరీ తోనే మెస్మరైజ్ చేసిన పరిణీతి చోప్రా..
ప్రముఖ రాజకీయ నాయకులు రాఘవ చద్దాతో పరిణితి ఏడడుగులు వేసే సమయంలో అత్యంత సుందరంగా ముస్తాబయింది. ఇక తన పెళ్లి వేడుకలో ఈ ముద్దుగుమ్మ తన జ్యూవెలరీతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక తన మేకప్ కోసం ఏకంగా రూ.35 లక్షలు ఉపయోగించింది.ఈ ముద్దుగుమ్మ.
సోదరుడి పెళ్లిలో మెరిసిన సారా టెండూల్కర్
క్రికెట్ దేవుడిగా పరిగణించే సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ వివాహం ఇటీవల అత్యంత ఘనంగా జరిగింది. ఇక సోదరుడి పెళ్లిలో తన మేకప్ తో అందరిని మెస్మరైజ్ చేసింది సారా టెండూల్కర్ . తన మేకప్ కోసం 30 లక్షలు ఖర్చు చేసింది ఈ చిన్నది.
సింపుల్ మేకప్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న గ్లోబల్ స్టార్..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నిక్ జోనస్ తో ఏడడుగులు వేసే సమయంలో బుట్ట బొమ్మలా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ వయ్యారి. తన గ్లామర్ లుక్ కోసం 26 లక్షలు ఖర్చు పెట్టింది.
మహారాణి లుక్ లో కియారా అద్వానీ.
కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఇందులో మహారాణి గెటప్ లో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన మేకప్ కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
సింపుల్ లుక్ తో మెస్మరైజ్ చేసిన సానియా చందోక్..
సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ సానియాతో ఏడడుగులు వేశారు. కేవలం చౌకర్ తో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసిన ఈమె.. సింపుల్ గా కనిపించినా ఏకంగా ఆ మేకప్ కోసం 10 లక్షలు ఖర్చుపెట్టిందట. ఏది ఏమైనా ఈ సెలబ్రిటీలంతా కూడా తమ పెళ్లి వేడుకల్లో ఈ రేంజ్ లో మేకప్ కోసం ఖర్చు పెట్టారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.