గాంధీ టాక్స్ ట్రైలర్.. మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్..!
గాంధీ టాక్స్ అంటే కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీ మాట్లాడటం అనే అర్ధం ఉన్నా భావాలకు భాష కాదు కాదు అసలు మాటలే అవసరం లేదు అన్నట్టుగా సినిమా మూకీగా తీస్తున్నారు.;
సినిమాను ఎంత కొత్తగా తీస్తే ఇప్పటి ప్రేక్షకులు అంత ఎక్కువ ఆదరిస్తున్నారు. అందుకే సినీ మేకర్స్, క్రియేటర్స్ కూడా ఒక సినిమాను ఎంత కొత్తగా తీయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నారు. కోట్ల కొద్దీ బడ్జెట్ పెట్టి సినిమా తీసినా అందులో ఎలాంటి కొత్తదనం లేకపోతే ఆడియన్స్ దాన్ని తిప్పికొడతారు. లిమిటెడ్ బడ్జెట్ తో తీసినా కొత్త పాయింట్ తో ప్రేక్షకులను మెప్పించగలిగితే చాలు దాన్ని వాళ్లు భుజాన వేసుకుని సక్సెస్ చేస్తారు. ఐతే ఈ లాజిక్ మాక్సిమం చాలా సినిమాలకు వర్క్ అవుట్ అయ్యింది.. అవుతుంది. ఏవో ఒకటి అర మిస్ ఫైర్ అవుతాయి.
నటీనటుల అభినయానికి మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం..
ఐతే ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్ పెరిమెంట్ అందించాలని డైరెక్టర్ కిషోర్ పండురంగ్ బెలెకర్ చేస్తున్న ప్రయత్నమే గాంధీ టాక్స్. విజయ్ సేతుపతి, అదితి రావు హైదరి, అరవింద సామితో పాటు మరికొంతమంది ముఖ్య తారాగణంతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది. గాంధీ టాక్స్ అంటే కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీ మాట్లాడటం అనే అర్ధం ఉన్నా భావాలకు భాష కాదు కాదు అసలు మాటలే అవసరం లేదు అన్నట్టుగా సినిమా మూకీగా తీస్తున్నారు.
గాంధీ టాక్స్ సినిమా రిలీజైన ట్రైలర్ చూస్తే తెర మీద నటీనటుల అభినయానికి మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం. అవే మాటలు అనిపించేలా చేశారు. రెహమాన్ కి ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి వర్క్ ఇచ్చే ప్రాజెక్ట్ ఇది అయ్యిందని చెప్పొచ్చు. అనుకున్నట్టుగానే ట్రైలర్ లో రెహమాన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. గాంధీ టాక్స్ కేవలం సినిమా ట్రైలర్ లోనే ఇలా మూకీ సినిమా చూపిస్తారా లేదా సినిమా అంతా ఇంతేనా అన్నది తెలియాల్సి ఉంది.
విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కి ఈ సినిమా సంథింగ్ స్పెషల్..
ఏది ఏమైనా విజయ్ సేతుపతి నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమాగా గాంధీ టాక్స్ వస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, అరవింద్ సామి యాక్టింగ్ ఆకట్టుకునేలా ఉంది. రెహమాన్ మ్యూజిక్ మేజర్ హైలెట్ అవ్వనున్న ఈ మూవీని జనవరి 30న రిలీజ్ ప్లాన్ చేశారు. తప్పకుండా విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కి ఈ సినిమా సంథింగ్ స్పెషల్ వైబ్ ఇస్తుందని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ చూడగానే ఎప్పుడో 3 దశాబ్దాల క్రితం మన తెలుగు దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు చేసిన పుష్పక విమానం గుర్తుకొస్తుంది. గాంధీ టాక్స్ ఈ సైలెంట్ ట్రైలర్ చాలా పెద్ద సంచలనమే సృష్టించేలా ఉంది. ట్రైలర్ లానే సినిమా కూడా అంతే పెద్ద సెన్సేషన్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో ఈ సినిమా వస్తుంది. చూస్తుంటే విజయ్ సేతుపతి మహారాజా తర్వాత మరో సినిమా ఆ రేంజ్ సూపర్ హిట్ ఇచ్చేలా ఉంది.