తలైవా తడాఖా! వయసు ఒక నంబర్ మాత్రమే!!
యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి రజనీకాంత్ మార్క్ స్టైల్‌ను, యూత్ ఫుల్ ఎలిమెంట్స్‌తో ఎలా చూపిస్తారో అన్న కుతూహలం అందరిలో ఉంది.;
సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం `తలైవర్ 173` గురించిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాల్లో హీట్ పుట్టిస్తోంది. 70 ప్లస్ వయసులోను రజనీ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ పెర్ఫామెన్సెస్ తో రక్తి కట్టిస్తుంటే అభిమానులకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు ఏకంగా ఇద్దరు హీరోయిన్లతో రజనీ రొమాన్స్ చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోందతి. తాజా సమాచారం మేరకు.. ఈ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే తో పాటు మరో ప్రముఖ హీరోయిన్ నటించే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. అలాగే ప్రియాంక మోహన్ ఓ కీలక పాత్రలో నటిస్తారని తెలుస్తోంది.
రజనీకాంత్‌తో పూజా హెగ్డే ఇప్పటివరకు నటించలేదు. ఒకవేళ ఈ ముంబై బ్యూటీ ఓకే అయితే ఇలాంటి క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మంచి హైప్‌ను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రజనీకాంత్ `జైలర్`లో ఒక కీలక పాత్రలో కనిపించిన ప్రియాంక, మళ్ళీ తలైవర్ సినిమాలో అవకాశం దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుంది. అలాగే మరో పెద్ద కథానాయిక ఎవరు? అన్నది కూడా వేచి చూడాలి.
ప్రస్తుతానికి కథానాయికల పాత్రలపై స్పష్టత లేదు కానీ.., ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే అది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయ్యే అవకాశం ఉంది. పూజా హెగ్డే మెయిన్ లీడ్ గా, మరో హీరోయిన్ తో పాటు, ప్రియాంక మోహనన్ అదనపు అస్సెట్ అవుతుందనడంలో సందేహం లేదు. ప్రియాంక మోహనన్ బహుశా రజనీ కుమార్తెగా లేదా ఫ్లాష్‌బ్యాక్ పాత్రలో కనిపించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తలైవర్ 173 ప్రత్యేకతలు
యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి రజనీకాంత్ మార్క్ స్టైల్‌ను, యూత్ ఫుల్ ఎలిమెంట్స్‌తో ఎలా చూపిస్తారో అన్న కుతూహలం అందరిలో ఉంది. తన సినిమాలో ట్యాలెంటెడ్ హీరోయిన్లు మాత్రమే నటించాలని అతడు పట్టుదలగా ఉన్నాడని కూడా సమాచారం. ఇది రజనీ ఎంపిక కాదు. సిబి ఎంపిక! అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ పెద్ద ప్లస్ కానుంది. రజనీకాంత్ - అనిరుధ్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్ అని అభిమానులు నమ్ముతారు. దానికి తగ్గట్టే మరో మ్యూజికల్ ట్రీట్ ఉంటుందని సమాచారం. అయితే ఈ వివరాలేవీ లైకా సంస్థ నుంచి అధికారికంగా వెల్లడి కాలేదు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ ఇద్దరు భామలు ఖరారైతే, సౌత్ ఇండియాలోనే ఇది ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అవుతుంది.