అనసూయ అంటే అంత అభిమానమా? నిజంగా గుడి కడతాడా?

అనసూయ కోసం గుడి కడతామంటూ ఆమె అభిమాని మురళీ శర్మ ప్రకటించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.;

Update: 2026-01-27 05:16 GMT

టాలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు కొంతకాలంగా తరచూ వార్తల్లో వినిపిస్తోంది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. అనసూయ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్.. ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఇవన్నీ కలిసి ఆ వ్యవహారం హాట్ టాపిక్‌ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన ప్రకటన వెలుగులోకి వచ్చింది.

అనసూయ కోసం గుడి కడతామంటూ ఆమె అభిమాని మురళీ శర్మ ప్రకటించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడినని చెప్పుకుంటూ మురళీ శర్మ రీసెంట్ గా మీడియాలో హైలెట్ అయ్యారు. అనసూయకు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్‌ గా మారాయి. ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలతో ట్రెండింగ్ లో ఉంటున్నారు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీ శర్మ.. తమిళనాడులో నటి ఖుష్బూకు గుడి ఉన్నట్టు, సమంతకు గుడి ఉన్నట్టు, యాంకర్ అనసూయకు గుడి కడతామని వెల్లడించారు. అభిమానులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎక్కడ ఆలయం నిర్మించాలనే విషయంపై తేలుస్తామని చెప్పారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు.

అనసూయ గారి అనుమతి తీసుకుని, ఆమె అంగీకరిస్తేనే ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అనసూయ అంటే తనకు అపారమైన గౌరవంమని, ఆమె చేసిన కౌంటర్‌ కు పూర్తిగా మద్దతు ఇస్తున్నానని చెప్పారు. అభిమానులందరూ కలిసి అనసూయకు గుడి కడతామని.. అక్కడ పూజారులు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రేమతో ఒక గులాబీ పెట్టినా చాలు అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

దీంతో మురళీ శర్మ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. కొంతమంది అభిమానులు మద్దతు తెలుపుతుంటే.. మరి కొందరు నెటిజన్లు మాత్రం గుడి నిర్మాణ ప్రకటనపై సెటైర్లు వేస్తున్నారు. నిజంగా గుడి కడతారా? ఎక్కడ కడతారు? ఎప్పుడు కడతారు? అనే ప్రశ్నలతో నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ విషయం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.

ఇక అనసూయ విషయానికొస్తే.. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు సినిమాల్లో కూడా నటించిన ఆమె.. ఆ పాత్రలతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు పలు విషయాలపై స్పందిస్తుంటారు. ఇప్పుడు తన గుడి కొడతామన్న ప్రకటనపై రెస్పాండ్ అవుతారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News