ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల లాభం ఏంటి..?

ఇప్పటికే రెండు సినిమాలు చేసిన అతను అతని యాటిట్యూడ్ చూసి అతనికి యాటిట్యూడ్ స్టార్ అన్న ట్యాగ్ ఇచ్చేశారు ఆడియన్స్.;

Update: 2026-01-27 05:39 GMT

బుల్లితెర స్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు చేసిన అతను అతని యాటిట్యూడ్ చూసి అతనికి యాటిట్యూడ్ స్టార్ అన్న ట్యాగ్ ఇచ్చేశారు ఆడియన్స్. ఐతే ఆ ట్యాగ్ కి ఏమాత్రం తగ్గకుండా చంద్రహాస్ ప్రవర్తన ఉంటుంది. అభిమానంతో ఇచ్చినా.. ఎలా ఇచ్చినా సరే ఒక ట్యాగ్ వచ్చింది దాన్ని కాపాడుకుందాం అన్నట్టుగా చంద్రహాస్ ప్లానింగ్ ఉన్నట్టు ఉంది. అంతేకాదు ఈ హీరో ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తే చాలు దానిలో కూడా ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటుంది.

బరాబర్ ప్రేమిస్తా సినిమాతో యాటిట్యూడ్ స్టార్..

ప్రస్తుతం అతను బరాబర్ ప్రేమిస్తా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 6న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో నెపొటిజం గురించి మాట్లాడుతూ ప్రభాకర్ కొడుకు కాకపోయుంటే తనకు ఇంకా మంచి అవకాశాలు వచ్చేవి అని అన్నాడు. ఈటీవీ ప్రభాకర్ కొడుకుగా ఒకేసారి రెండు సినిమాలతో లాంచ్ అయ్యాడు చంద్రహాస్. అఫ్కోర్స్ అతనిలో ఎంత టాలెంట్ ఉన్నా మొదటి ఛాన్స్ వచ్చింది అంటే మాత్రం ప్రభాకర్ వల్లే.

ఐతే తను ప్రభాకర్ కొడుకు కాకపోతే మరిన్ని అవకాశాలు.. ఎలాంటి రోల్స్ అయినా వచ్చేవంటూ అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐతే ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల అతనికి ఎలాంటి లాభం ఉండదు. టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా అవకాశాలు వస్తాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేని వారు కూడా వచ్చి చలన చిత్ర పరిశ్రమలో స్టార్ అయిన వాళ్లు ఉన్నారు.

మీడియా అటెన్షన్.. నెటిజన్లను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశ్యంతో..

చంద్రహాస్ ఇదేదో మీడియా అటెన్షన్.. నెటిజన్లని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన కామెంట్స్ తప్ప మరోలా అనిపించట్లేదు. ఏది ఏమైనా తన సినిమా ప్రమోషన్స్ లో ఆ ప్రాజెక్ట్ ని జనాలకు చేర్చే ప్రయత్నంలో అతను చేస్తున్న ప్రయత్నాలు ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈటీవీ ప్రభాకర్ ఇప్పటికీ బుల్లితెర సీరియల్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన వారసుడిగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రతిభ చాటాలని అనుకుంటున్నాడు చంద్రహాస్. మరి ఈ ప్రయత్నాలు అతనికి ఎలాంటి కెరీర్ ని ఏర్పరుస్తాయి అన్నది చూడాలి.

టాలెంట్ ఉంటే చాలు కచ్చితంగా ఇండస్ట్రీలో ఒకసారి కాకపోయినా మరోసారి అయినా ఏదో ఒక టైం లో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. ఐతే అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. చంద్రహాస్ అయితే యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ తో తన టాలెంట్ చూపించాలని వస్తున్నాడు. యాక్టర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే మాత్రం అతన్ని ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారి చేతే సూపర్ అనిపించుకునే రోజు కూడా వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News