వారణాసి షూటింగ్ 70 శాతం పూర్తయిందా!
రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో ఎక్కడా సమయం వృథా కాకుండా అత్యంత వేగంగా గ్లోబల్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు.;
సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా `వారణాసి` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎంత వరకూ పూర్తయింది? అన్నది ఇంత వరకూ బయటకు రాలేదు. తాజాగా చిత్ర యూనిట్ నుంచి ఆ అప్ డేట్ అందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయినట్లు సమాచారం. రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో ఎక్కడా సమయం వృథా కాకుండా అత్యంత వేగంగా గ్లోబల్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ అత్యంత రిచ్ లోకేషన్లలోనే జరిగాయి.
ముఖ్యంగా ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో మహేష్ బాబుపై కీలకమైన అడ్వెంచర్ సీన్లను చిత్రీకరించారు. అడవుల నేపథ్యంలో సాగే కథ కోసం రాజమౌళి బృందం నెలల తరబడి అక్కడే మకాం వేసి పని చేసింది. ప్రకృతి సిద్ధమైన లొకేషన్లలో షూటింగ్ పూర్తి నిర్వహించారు. అడవిలో జరిగే పోరాట సన్నివేశాలు , మహేష్ బాబు ఛేజింగ్ సీన్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ఆఫ్రికా షెడ్యూల్ అనంతరం యూనిట్ ఐరోపాలోని కొన్ని మంచు కొండల ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. అక్కడ మహేష్ సరికొత్త మేకోవర్‌లో, లాంగ్ హెయిర్ , గడ్డంతో కనిపిస్తారని తెలుస్తోంది.
విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. దీంతో లైవ్ లోకేషన్ల వాడకం వల్ల సినిమాకు సహజత్వం లభిస్తుందని రాజమౌళి గట్టిగా నమ్మి ముందుకెళ్తున్నారు. అందుకే గ్రీన్ మ్యాట్ కంటే ఎక్కువ శాతం రియల్ లోకేషన్లకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్లలలో కొన్ని సన్నివేశాలు...ఒరిస్పా రాష్ట్రంలోని హిల్ ఏరియాలో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్స్ విషయానికి వస్తే కాశీ లోని గంగా నది తీరంలో కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించబోతున్నారు.
వాస్తవానికి వారణాసి సెట్ వేసి కొన్ని సన్నివేశాలు షూట్ చేసారు. కానీ రియలిస్టిక్ అప్పిరియన్స్ మిస్ అవుతుంది? అన్న ఉద్దేశంతో సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలను రియల్ లోకేషన్స్ లోనే ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఆధ్యాత్మికత , అడ్వెంచర్ కలగలిసిన కథలో వారణాసి ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది. పురాతన కట్టడాలు, గంగా హారతి , కాశీ వీధుల్లో మహేష్ పై కొన్ని సీరియస్ సన్నివేశాలను షూట్ చేయనున్నారుట. ఇక్కడ జరిగే షెడ్యూల్‌తో సినిమాలోని ప్రధాన కథాంశానికి ముగింపు లభిస్తుందని సమాచారం.
వారణాసి తర్వాత చిత్ర యూనిట్ మరికొన్ని దేశాలకు వెళ్లనుంది. వియత్నాం , థాయిలాండ్ లోని జలపాతాలు, గుహల నేపథ్యంలో కొన్ని సాహసోపేతమైన సీన్లను ప్లాన్ చేశారు. రాజమౌళి తన సినిమాల్లో లొకేషన్ల ద్వారానే సగం కథను చెప్పేస్తున్నారు. అందుకే ఈ గ్లోబల్ అడ్వెంచర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన ప్రదేశాలను ఎంచుకున్నారు. ప్రతి లొకేషన్ ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్‌లా అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు.మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత తర్వగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నారు.