రాజ‌మౌళి 'మ‌హాభార‌తం'లో దుర్యోధ‌నుడి పాత్ర‌కు ఎవ‌రైతే క‌రెక్ట్?

ఇక ఇతర అగ్ర నటులలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ య‌మ‌గోల చిత్రంలో య‌ముడిగా న‌టించి మెప్పించారు. అత‌డిలోని గాంభీర్యం దుర్యోధ‌నుడి పాత్ర‌కు సూట‌బుల్.

Update: 2026-08-06 10:34 GMT

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలల ప్రాజెక్ట్ `మహాభారతం`. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించాల‌ని ఆయ‌న చాలా కాలంగా క‌ల‌లు కంటున్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇంత‌కాలం ఆల‌స్య‌మైంది. కానీ ఇప్పుడు నితీష్ తివారీ `రామాయ‌ణం` ర‌గిలించే స్ఫూర్తితో `మ‌హాభార‌తం` తెర‌కెక్కించేందుకు జ‌క్క‌న్న సిద్ధ‌మ‌వుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆయన తెరకెక్కిస్తే అందులో పోషించాల్సిన కీల‌క పాత్ర‌ల‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా చ‌ర్చ జ‌రుగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేమం లేదు. అత్యంత‌ ముఖ్య‌మైన `దుర్యోధనుడి` పాత్రను పోషించాలని ఉందని ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో తన మనసులోని కోరికను వెల్లడించారు. మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర అత్యంత క్లిష్టమైనదని.. ఆసక్తికరమైనదని మ్యాడీ అభిప్రాయపడ్డారు. కథను ఏ కోణం నుండి చెబుతున్నామనే దానిపైనే నాయకుడికి, విలన్‌కు మధ్య తేడా ఆధారపడి ఉంటుందని.. విధికి-కర్తవ్యానికి మధ్య నలిగిపోయి చివరికి కపటత్వంతో అంతమయ్యే దుర్యోధనుడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా గొప్ప అవకాశమని మాధవన్ సరైన విశ్లేషణ చేశారు.

దుర్యోధనుడు అనగానే కేవలం చెడు లక్షణాలు ఉన్న వ్యక్తి మాత్రమే కాదు.. అతడిలో అపారమైన రాజసం, గాంభీర్యం.. గదా యుద్ధంలో తిరుగులేని నైపుణ్యం.. స్నేహానికి ఇచ్చే విలువ.. పట్టుదల ఉంటాయి. ఈ తరహా సంక్లిష్టమైన పాత్రలోని భారీతనాన్ని గాంభీర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించే నటులు భారతీయ చిత్రసీమలో చాలా అరుదుగా ఉంటారు. కేవలం శారీరక దార్ఢ్యమే కాకుండా.. కంటిచూపుతోనే గంభీరమైన భావాలను.. అహంకారాన్ని.. అంతర్మథనాన్ని పండించగల ప్రతిభ ఉన్న నటులకే ఈ పాత్ర సెట్ అవుతుంది.

ఒకవేళ భారతీయ సినిమాలోని టాప్-10 నటులను పరిశీలిస్తే.. ఈ పాత్రకు అత్యంత ప‌ర్ఫెక్ట్‌గా సరిపోయే నటులలో `యంగ్ రెబెల్ స్టార్` ప్రభాస్ ఒక‌రు. `బాహుబలి`లో అమరేంద్ర బాహుబలిగా, రాజసంతో కూడిన యోధుడిగా ఆయన చూపించిన గాంభీర్యం, కటౌట్ దుర్యోధనుడి పాత్రకు నూటికి నూరు శాతం సరిపోతాయి. యాధృచ్ఛికంగానే ప్ర‌భాస్ త‌న `క‌ల్కి 2898 ఏడి` చిత్రంలో దుర్యోధ‌నుడి స్నేహితుడు క‌ర్ణుడిగా న‌టించారు. అయితే దుర్యోధ‌నుడి పాత్ర‌కు ప్ర‌భాస్ క‌టౌట్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని ఒక అంచనా. అలాగే కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా తన గంభీరమైన స్వరం.. పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్.. అగ్రెస్సివ్ నటనతో దుర్యోధనుడి అహంకారాన్ని, రాజసాన్ని తెరపై అద్భుతంగా పండించగలరు. ఇటీవ‌ల `రామాయ‌ణం` ట్రైల‌ర్‌లో రావ‌ణుడిగా య‌ష్ న‌ట‌న‌కు గొప్ప గుర్తింపు ద‌క్కుతోంది. అత‌డు దుర్యోధ‌నుడి పాత్ర‌కు యాప్ట్ అని విశ్లేషిస్తున్నారు.

ఇక ఇతర అగ్ర నటులలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ య‌మ‌గోల చిత్రంలో య‌ముడిగా న‌టించి మెప్పించారు. అత‌డిలోని గాంభీర్యం దుర్యోధ‌నుడి పాత్ర‌కు సూట‌బుల్. ఇక త‌మిళంలో విక్రమ్ లేదా సూర్య వంటి నటులు తమ వైవిధ్యమైన అభినయంతో దుర్యోధనుడిలోని విషాదాన్ని, భావోద్వేగమైన అంతర్మథనాన్ని డెప్త్ తో చూపించగల స‌మ‌ర్థులు. బాలీవుడ్ నుంచి రణ్‌వీర్ సింగ్ ఇప్పటికే `పద్మావత్`లో ఖిల్జీగా చూపించిన భయంకరమైన ఆరా, ఎనర్జీతో దుర్యోధనుడి పాత్రకు కొత్త కోణాన్ని ఇవ్వగలరు. అయితే ఆర్. మాధవన్ చెప్పినట్లుగా దుర్యోధనుడిని కేవలం విలన్‌గా కాకుండా ఒక `ట్రాజిక్ హీరో`గా చూపిస్తే మాధవన్ లాంటి పరిణతి చెందిన నటుడు కూడా ఆ పాత్రలోని నైతిక ఘర్షణను అత్యద్భుతంగా ఆవిష్కరించగలరు.

రాజమౌళి తీసే `మహాభారతం`లో దుర్యోధనుడి పాత్రకు భీక‌ర‌ రూపం.. గంభీరమైన కటౌట్.. అసాధార‌ణ నటకౌశలం కలబోసిన ప్రభాస్, యష్, ఎన్టీఆర్ అత్యంత సూటబుల్ న‌టులు అన‌డంలో సందేహం లేదు. ఎందుకంటే రాజమౌళి లార్జర్-ద్యాన్-లైఫ్ శైలికి వారిద్దరి మాస్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోతాయి. ఏది ఏమైనా మహాభారతాన్ని రాజమౌళి ఏ కోణంలో రాస్తారు? దుర్యోధనుడి పాత్రకు ఏ నటుడిని ఎంచుకుంటారో చూడటం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారనుంది.

Tags:    

Similar News