ట్రాజెడీని ఎస్కేప్ చేసే మెకానిజం కామెడీ: త‌రుణ్ భాస్క‌ర్

పెళ్లి చూపులు చిత్రం కోసం ప‌ని చేసేప్పుడు త‌ర‌ణ్ భాస్క‌ర్ ఇంట్లో ప‌రిస్థితులు క్లిష్ఠ‌మైన‌వి. క‌ష్టంలో కూడా అతడు పాజిటివ్ గా ఆలోచించాడు. త‌న ప్ర‌తిభ‌కు మెరుగుల‌ద్ది ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు.;

Update: 2026-01-27 03:49 GMT

కామెడీ అనేది ట్రాజెడీ నుంచి ఎస్కేప్ అవ్వ‌డానికి ఉప‌యోగ‌ప‌డే ఒక మెకానిజం అని అన్నారు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత త‌రుణ్ భాస్క‌ర్. జంధ్యాల `అహ‌నా పెళ్లంట` బ్ర‌హ్మానందం గారి మొద‌టి సినిమా. లెక్చ‌ర‌ర్ ఉద్యోగం మానేసి బ్ర‌హ్మానందం ఈ సినిమాలో న‌టించారు. అప్ప‌టి ట్రాజిక్ ప‌రిస్థితులే దానికి కార‌ణం అని తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాను. చార్లీ చాప్లిన్ ఎంత కామెడీ చేసినా ట్రాజెడీని ఎస్కేప్ చేయ‌డానికి ఒక మెకానిజంగా ఉప‌యోగించారు.. ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకుంటున్నా, దానిని క‌నిపించ‌నీయ‌కుండా స్కూల్ లో మ్యానేజ్ చేయ‌డానికి హాస్య‌న‌టుడిగా మార‌డం ఇలాంటిదేన‌ని త‌రుణ్ భాస్క‌ర్ వివ‌రించారు.

పెళ్లి చూపులు స్క్రిప్ట్ రాసేప్పుడు త‌న‌కు ఇలాంటి ప‌రిస్థితులే ఉన్నాయ‌ని కూడా ఆయ‌న అన్నారు. తన తండ్రి అనారోగ్యంతో చివరి రోజుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల నడుమ తరుణ్ భాస్కర్ `పెళ్లిచూపులు` స్క్రిప్ట్ రాశారు. రాత్రులు తన తండ్రి బతికే ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటూ ఈ కామెడీ స్క్రిప్ట్ రాయడం తన జీవితంలో ఒక పెద్ద ట్రాజెడీ అని, కానీ ట్రాజెడీ నుండే కామెడీ పుడుతుందని త‌రుణ్ భాస్క‌ర్ వివరించారు. త‌రుణ్ భాస్క‌ర్ ప్ర‌స్తుతం `ఈ న‌గ‌రానికి ఏమైంది 2` సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజా ఇంట‌ర్వ్యూలో త‌రుణ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

పెళ్లి చూపులు చిత్రం కోసం ప‌ని చేసేప్పుడు త‌ర‌ణ్ భాస్క‌ర్ ఇంట్లో ప‌రిస్థితులు క్లిష్ఠ‌మైన‌వి. క‌ష్టంలో కూడా అతడు పాజిటివ్ గా ఆలోచించాడు. త‌న ప్ర‌తిభ‌కు మెరుగుల‌ద్ది ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు. న‌టుడిగాను అత‌డు బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఇదే ఇంట‌ర్వ్యూలో త‌రుణ్ చెప్పిన మ‌రిన్ని సంగ‌తులు ప‌రిశీలిస్తే, తన తండ్రి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా కానీ, తరుణ్ భాస్కర్ మొదట్లో విభజనకు వ్యతిరేకంగా ఉండేవాడిన‌ని తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా స్టేట్ విడిపోవడం మంచిదే అయినా, సినిమాలు మాత్రం మనుషులను కలపాలి గానీ విడదీయకూడదని తాను న‌మ్మిన‌ట్టు వెల్ల‌డించారు.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టే వారి గురించి మాట్లాడుతూ..``మమ్మల్ని మా అమ్మలే బూతులు తిడుతుంటారు, మీ తిట్లు మాకేం కొత్త కాదు అని సరదాగా అంటూనే, ఎదుటివారిని కించపరిచే వారిని దేవుడు క్షమించడని, దానికి ప్రతిఫలం ఉంటుందని హెచ్చరించారు.

విజయ్ దేవరకొండ సక్సెస్ గురించి మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ ఒక గొప్ప నటుడని, ఆయన తనకంటూ ఒక ఐకానిక్ ఇమేజ్‌ను (అర్జున్ రెడ్డిని ఉద‌హ‌రిస్తూ) సృష్టించుకున్నారని తరుణ్ అన్నారు. ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న స్ట్రగుల్ కేవలం ఒక ఫేజ్ మాత్రమేనని, ప్రతి నటుడి కెరీర్ గ్రాఫ్ ఒక ఈసీజీ లాగా హెచ్చుతగ్గులతో ఉండాలని, త్వరలోనే విజయ్ తన సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

తరుణ్ భాస్కర్ తదుపరి చిత్రం ఈ నగరానికి ఏమైంది 2 (ENA రిపీట్) ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News