తొలిసారి సీత‌మ్మ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న‌ది అత‌డి వద్ద‌నే!

టాలీవుడ్‌లో `సీతారామం` చిత్రంతో `సీతమ్మ`గా కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న భామ మృణాల్ ఠాకూర్.;

Update: 2026-03-19 00:30 GMT

టాలీవుడ్‌లో `సీతారామం` చిత్రంతో `సీతమ్మ`గా కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న భామ మృణాల్ ఠాకూర్. తనదైన సహజ నటనతో, క్లాసిక్ లుక్స్‌తో సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృణాల్ తన కెరీర్ తొలినాళ్లలో ఒక స్టార్ డైరెక్టర్‌ను స్వయంగా కలిసి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడిగారట. కానీ ఆయన మాత్రం అప్పట్లో ఆమెకు అవకాశం ఇవ్వలేకపోయారు. ఆ దర్శకుడు మరెవరో కాదు. `ధురంధ‌ర్` చిత్రంతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన‌ ఆదిత్య ధర్.

మృణాల్ ఠాకూర్ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆదిత్య ధర్ తన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం `ఉరి: ద సర్జికల్ స్ట్రైక్` కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మృణాల్ ఆయనను కలిసి తనకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాల‌ని కోరారుట‌. కానీ అప్పటికే ఆ పాత్రకు మరొకరిని ఎంపిక చేయడం లేదా మృణాల్ ఇమేజ్ ఆ పాత్రకు సెట్ కాదని భావించడంతో ఆదిత్య ఆమెకు నో చెప్పారుట‌. నిజానికి మృణాల్ ఠాకూర్ ప్రతిభపై ఆదిత్య ధర్ కి అప్పట్లోనే మంచి అభిప్రాయం ఉండేదట. అయితే సినిమాలోని పాత్ర స్వభావం దృష్ట్యా ఆమెను పక్కన పెట్టాల్సి వచ్చిందిట‌.

ఒకవేళ అప్పుడే ఆదిత్య ధర్ మృణాల్ కు అవకాశం ఇచ్చి ఉంటే మృణాల్ బాలీవుడ్‌లోనే సెటిల్ అయ్యేదేమో! కానీ ఆ ఛాన్స్ మిస్ అవ్వడం వల్లే ఆమె టాలీవుడ్‌కు రావడం ఇక్కడ సీతమ్మగా ఫేమ‌స్ అయింద‌ని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో దక్కని ఆ ఒక్క ఛాన్స్? నేడు ఆమెను సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా నిలబెట్టిందన్న‌ది కాద‌న‌లేని నిజం. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పాత విషయాలను బయట పెట్టడానికి ఇష్టపడరు. కానీ మృణాల్ మాత్రం స్ట్రగుల్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడటం విశేషం.

ఆదిత్య ధర్ లాంటి విజన్ ఉన్న దర్శకుడి వద్ద అవకాశం అడగడం తనకెప్పుడూ తప్పుగా అనిపించలేదంది. ప్రతి రిజెక్షన్ మరింత బలంగా మారుస్తుందని పేర్కొంది. ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ?ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. అప్పట్లో మృణాల్‌కు ఛాన్స్ ఇవ్వని అదే బాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో భవిష్యత్తులో మృణాల్ ఒక పవర్‌ఫుల్ రోల్ చేసే అవకాశం లేకపోలేదు. అప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న అదే మృణాల్ ఒక స్టార్ హీరోయిన్‌గా ఆదిత్య ధ‌ర్ సెట్‌లో అడుగుపెడితే ఆ క్రేజే వేరుగా ఉంటుంది. అమ్మ‌డి అభిమానులు సైతం ఆరోజు ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News