ఉల‌క‌డు..ప‌ల‌క‌డ‌ని ఆ లెజెండ్ ని దేవుడ్ని చేసేసారు!

తెలుగు చ‌ల‌న చిత్ర పరిశ్రమలో నటనతో, వ్యక్తిత్వంతో చెరగని ముద్ర వేసిన దిగ్గజ నటులలో సూపర్‌స్టార్ కృష్ణ ఒకరు.

Update: 2026-08-04 19:30 GMT

తెలుగు చ‌ల‌న చిత్ర పరిశ్రమలో నటనతో, వ్యక్తిత్వంతో చెరగని ముద్ర వేసిన దిగ్గజ నటులలో సూపర్‌స్టార్ కృష్ణ ఒకరు. తెరపై ఆయన దూకుడు, సాహసాలు ఎంతటి సంచలనం సృష్టించాయో? ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వెండితెరకు పూర్తిగా భిన్నంగా కృష్ణ నిజ జీవితం.. ముఖ్యంగా విద్యార్థి దశ ఎంత నిరాడంబరంగా సాగిందనే విషయాలపై తోటి నటుడు మురళీ మోహన్ కొన్ని ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. కృష్ణ తో తన ఉన్న రోజులు ..కాలేజీ అనుభవాలను గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కాలేజీ రోజుల్లో కృష్ణ ప్రశాంతంగా, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా చాలా కామ్ గోయింగ్‌గా ఉండేవారని తెలిపారు. అప్పట్లో కాలేజీ అంటేనే కుర్రాళ్ల అల్లరి, హంగామా ఎక్కువగా ఉండేది. కానీ కృష్ణ మాత్రం ఆ తరహా పనులకు పూర్తిగా దూరంగా ఉండేవారన్నారు. కాలేజీకి రావడమే పనిగా పెట్టుకున్న కృష్ణ, క్లాసులు ముగియగానే నేరుగా ఇంటికి వెళ్లిపోవడం ఆయన దినచర్యగా ఉండేది. తోటి విద్యార్థుల లాగా ఎలాంటి అల్లరి పనులు చేయడం, ఎవరినైనా ఏడిపించడం వంటి సరదాలకు కూడా ఆయన దూరంగా ఉండేవారు. ఎంతసేపూ చదువుపై, తన లక్ష్యాలపైనే ఆయన దృష్టి కేంద్రీకరించేవారని సహచరులు గుర్తు చేసుకుంటూ ఉండేవారు.

ఆయనలో నిశ్శబ్ద స్వభావాన్నే చూసి తోటి స్నేహితులు ..సహచరులు సరదాగా ఉలకడు.. పలకడు అని పిలిచేవారుట. ఎవరైనా మాట్లాడించినా నవ్వుతూ ఊరుకోవడం తప్ప పెద్దగా మాట్లాడేవారు కాదట. అలా అందరిలోనూ ఎంతో సైలెంట్‌గా ఉండే కృష్ణ తీరును చూసి కాలేజీ రోజుల్లోనే స్నేహితులు ఆశ్చర్యపోయి ఆయనకు ముద్దుగా దేవుడు అనే బిరుదు కూడా పెట్టేశార‌న్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిబద్ధతతో కూడిన ఆనాటి వ్యక్తిత్వమే కృష్ణను భవిష్యత్తులో టాలీవుడ్ పరిశ్రమకు నిజమైన లెజెండ్‌గా నిలబెట్టిందని చెప్పొచ్చు.

కాలేజీ రోజుల్లో..వ్య‌క్తిగ‌త జీవితంలో ముఖంపై చిరునవ్వుతో ఎవరికీ హాని చేయకుండా జీవించిన ఆ సుగుణాలే ఆయ‌న్ని ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో దేవుడిలా కొలువుండేలా చేశాయి. వెండితెరపై సూపర్‌స్టార్‌గా వెలిగిపోయిన కృష్ణ గత కాలపు జ్ఞాపకాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుం టున్నాయి. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్‌డమ్ సంపాదించుకున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడూ తన ఒదిగి ఉండే స్వభావాన్ని మార్చుకోలేదని ఈ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది.

కృష్ణ సినిమాల్లోకి రావ‌డానికి మొద‌టి కార‌కులు ఏఎన్నార్ అయితే త‌ర్వాత ఎన్టీఆర్ కీల‌క పాత్ర పోషించారు. ఎన్టీఆర్ సినిమాలంటే కృష్ణ ఎంతో అభిమానించేవారు. వాస్త‌వానికి కృష్ణ‌కు సినిమాలంటే తొలుత ఆస‌క్తి ఉండేది కాదు. ఆ స‌మ‌యంలో అందంగా ఉంటావ్? సినిమాల్లో ట్రై చేయండ‌ని కొంత మంది ఇచ్చిన స‌ల‌హాతో ఆలోచ‌న‌ క‌లిగింది. ఆ స‌మ‌యంలోనే ఏఎన్ఆర్ ను చూసి తాను పెద్ద స్టార్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Tags:    

Similar News