బాక్సాఫీస్.. మొదటి రోజు కంటే 4వ రోజు ఎక్కువగా..

అందరినీ షాక్ కి గురి చేస్తూ నాలుగో రోజు అంటే రిపబ్లిక్ డే నాడు రూ. 60.25 కోట్లతో బాక్సాఫీస్ వద్ద తన అసలు సత్తా చాటుకుంది.;

Update: 2026-01-27 04:52 GMT

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, కొన్ని సార్లు బాక్సాఫీస్ లెక్కలు ఊహించని విధంగా మారుతుంటాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'బార్డర్ 2' చిత్రం ఇప్పుడు సరిగ్గా ఇదే బాటలో పయనిస్తోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రాలకు ఉండే స్పెషల్ క్రేజ్ ఈ సినిమా వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రిపబ్లిక్ డే వీకెండ్ ఈ మూవీకి ఒక పెద్ద వరంగా మారింది. నార్త్ బెల్ట్‌లో సన్నీ డియోల్ మాస్ పవర్ థియేటర్ల వద్ద గట్టిగానే సౌండ్ చేస్తోంది.

ఈ సినిమా కలెక్షన్ల గ్రాఫ్ గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చి, ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతుంటాయి. కానీ 'బార్డర్ 2' విషయంలో సీన్ కంప్లీట్ రివర్స్ అయ్యింది. ఫస్ట్ డే కంటే సెకండ్ డే.. సెకండ్ డే కంటే థర్డ్ డే.. ఇలా ప్రతిరోజూ వసూళ్లు పెరుగుతూ పోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఆల్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా సాధిస్తున్న ట్రాక్డ్ గ్రాస్ కలెక్షన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

లెక్కల్లోకి వెళ్తే.. మొదటి రోజు రూ. 31.85 కోట్ల గ్రాస్‌తో ఓపెన్ అయిన ఈ చిత్రం, రెండో రోజు రూ. 39.55 కోట్లు రాబట్టింది. ఇక మూడో రోజు ఏకంగా రూ. 56 కోట్లకు జంప్ అయ్యింది. అందరినీ షాక్ కి గురి చేస్తూ నాలుగో రోజు అంటే రిపబ్లిక్ డే నాడు రూ. 60.25 కోట్లతో బాక్సాఫీస్ వద్ద తన అసలు సత్తా చాటుకుంది. అంటే ఫస్ట్ డే వసూళ్లతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ దాదాపు రెట్టింపు అయ్యాయి. సినిమా టాక్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా, వసూళ్ల విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతోంది.

నేటి జనరేషన్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా భారీ యాక్షన్ సీక్వెన్స్, గ్రాండియర్ విజువల్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. పాత 'బార్డర్' క్లాసిక్ గుర్తులను గుర్తు చేస్తూ ఏఐ (AI) టెక్నాలజీతో సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా క్యారెక్టర్లను చూపించడం థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. సన్నీ డియోల్ వింటేజ్ యాక్షన్ తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ వంటి యంగ్ స్టార్స్ ఉండటం వల్ల యూత్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ వినిపిస్తున్నా.. ఎమోషనల్ కనెక్ట్ మాత్రం ఆడియన్స్‌కు బాగా తగిలిందని తెలుస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ. 180 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఇదే జోరు కొనసాగితే లాంగ్ రన్‌లో ఈ సినిమా సులభంగా రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరిపోయే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. రణవీర్ సింగ్ 'ధూరందర్' లాంటి సినిమాల రికార్డులను కూడా ఈ మూవీ సవాల్ చేసేలా కనిపిస్తోంది.

మొత్తానికి 'బార్డర్ 2' బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ స్టార్ట్ అందుకుంది. దేశభక్తి సెంటిమెంట్ పండితే రికార్డులు ఎలా తిరగరాయచ్చో సన్నీ డియోల్ మరోసారి నిరూపించారు. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ రోజురోజుకూ పెరుగుతూ ఉండటం ఈ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్. లాంగ్ రన్‌లో ఈ వార్ డ్రామా ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సన్నీ డియోల్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లే కనిపిస్తోంది.

Tags:    

Similar News