ద్వేషించే వారిని సైతం ప్రేమ‌తో గెల‌వొచ్చు డ్యూడ్!

నిజానికి గతంలో ఒక వివాహ రిసెప్షన్‌లో త్రిష -విజయ్‌ల ఉద్దేశించి పార్థిబన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.;

Update: 2026-03-15 14:51 GMT

సినీ పరిశ్రమలో విభేదాలు, విమర్శలు సర్వసాధారణం. అయితే ఆ విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా, వృత్తిపరంగా , వ్యక్తిగతంగా హుందాగా వ్యవహరించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. తాజాగా సౌత్ హీరోయిన్ త్రిష సరిగ్గా ఇదే నిరూపించారు. సెలబ్రిటీ స్టైలిస్ట్ ఏకా లఖానీ వివాహ వేడుకలో త్రిష, నటుడు పార్థిబన్ కుమార్తె కీర్తనతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో పార్థిబన్ చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో, త్రిష ఇలా ఆయన కుమార్తెతో ఎంతో ఆత్మీయంగా మెలగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

నిజానికి గతంలో ఒక వివాహ రిసెప్షన్‌లో త్రిష -విజయ్‌ల ఉద్దేశించి పార్థిబన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అలాగే విజయ్ రాజకీయ ప్రయాణంపై కూడా ఆయన పరోక్షంగా సెటైర్లు వేశారు. ఆ సమయంలో త్రిష సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఆ వివాదాన్ని అక్కడితోనే వదిలేశారు. ఇప్పుడు ఏకా లఖానీ పెళ్లిలో పార్థిబన్ కుమార్తె కీర్తన కనిపిస్తే త్రిష ఆమెను ఆత్మీయంగా పలకరించడమే కాకుండా సెల్ఫీలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఆమెలోని గొప్ప సంస్కారానికి సూచిక‌గా చెప్పొచ్చు.

త్రిష స్వభావం విషయానికి వస్తే ఎప్పుడూ లివ్ అండ్ లెట్ లివ్ అనే సిద్ధాంతాన్ని పాటిస్తారు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రస్థాయిలో కొనసాగుతున్నారంటే? కేవలం ఆమె అందం, అభినయం మాత్రమే కాదు. వివాదాలకు దూరంగా ఉండే ఆమె వ్యక్తిత్వం కూడా ఓ కారణం. ఎవరైనా తనను విమర్శించినా? ఆమె మౌనంగానే సమాధానం చెబుతారు లేదా తన పనిత‌నంతో వారి నోళ్లు మూయిస్తారు. పార్థిబన్‌తో విభేదాలు ఉన్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండటం ఆమె పరిణతికి నిదర్శనం. గ‌తంలో విజయ్ - త్రిషల మధ్య ఉన్న స్నేహం గురించి పార్థిబన్ విమర్శలు చేసినా? విజయ్ రాజకీయాల్లోకి రావడంపై వ్యంగ్యంగా మాట్లాడినా? త్రిష వాటన్నింటినీ ఒక ప్రొఫెషనల్ లా డీల్ చేశారు.

తన వ్యక్తిగత విష‌యాలు వృత్తి పరమైన విమర్శలపై ఎంతో బ్యాలెన్స్ గా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా కీర్తనతో దిగిన ఫోటోలో త్రిష ముఖంలోని చిరునవ్వు చూస్తుంటే? ఆమె మనసులో ఎటువంటి ద్వేషం లేదని స్పష్టమవుతోంది. త్రిషలోని ఈ పాజిటివ్ ఆటిట్యూడ్ నేటితరం నటీనటులకు ఒక గొప్ప పాఠం. త్రిష కేవలం తెరపైనే కాదు. నిజ జీవితంలోనూ ఓ క్వీన్ అని మ‌రోసారి నిరూపించారు. విమర్శించిన వారిని కూడా ఆత్మీయంగా పలకరించే మనసు ఉన్నప్పుడే ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ద్వేషించే వారిని కూడా ప్రేమతో జయిం చవచ్చు అనే ఓ సినిమాలో డైలాగ్ ను త్రిష అనుస‌రించి స‌క్సెస్ అయింది.

Tags:    

Similar News