టికెట్ బుకింగ్స్ లో తగ్గని జోరు.. ఆపేదెవరు అంటూ ఫోజు!

2026 మెగా హీరోలకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Update: 2026-08-09 11:21 GMT

2026 మెగా హీరోలకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పైగా ఈ సినిమా రూ.90 నుండి రూ.100 కోట్ల లోపు కలెక్షన్లు వసూలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ప్రముఖ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ' పెద్ది' సినిమాతో ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించారు.. ఇలా మెగా హీరోలు అందరూ ఈ ఏడాది మంచి కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతుంటే.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో మెగా హీరో వచ్చి చేరారు. ఆయన ఎవరో కాదు మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్.




 


తన సినీ కెరియర్ లో ప్రస్తుతం హిట్ అనివార్యం కావడంతో జానర్ మార్చి ఇండో కొరియన్ కామెడీ హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.' కొరియన్ కనకరాజు' అంటూ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇందులో వరుణ్ తేజ్ యాక్టింగ్ ,సత్య కామెడీ సినిమాకే హైలెట్గా నిలిచాయి. ఆగస్టు ఆరవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రానికి పెయిడ్ ప్రీమియర్ షో వేయగా.. మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ లభించింది. పైగా రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడం, మౌత్ టాక్ బాగుండడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి.




 


ముఖ్యంగా మొదటి రోజు కంటే రెండవ రోజు ఈ సినిమాకు స్క్రీన్స్ పెరగడంతో వసూలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇకపోతే విడుదలైన మొదటి రోజు సుమారుగా రూ.8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన ఈ సినిమా.. రెండు రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 250K డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఇక ఇటు బుక్ మై షో లో కూడా ఈ చిత్రానికి జోరుగా టికెట్స్ బుక్ అవుతుండడం గమనార్హం. కేవలం డిస్టిక్ వైస్ గానే 500 K పైగా టికెట్లు ఒక్క బుక్ మై షో లోనే అమ్ముడుపోవడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే కొరియన్ కనకరాజు సినిమాకి ప్రేక్షక ఆదరణ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అటు తెలంగాణలో బోనాలు పండుగ సందర్భంగా సోమవారం కూడా సెలవు దినం కావడంతో ఈ వసూలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి అయితే కొరియన్ కనకరాజు చిత్రానికి మూడు రోజులు కలిసి రావడం అటు ఓవర్సీస్ లో కూడా మంచి మౌత్ టాక్ రావడంతో కలెక్షన్లు జోరుగా పెరిగాయి. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్లు సినిమాకి వస్తున్న ఆదరణను చూసి అదనపు షోలతో పాటు థియేటర్లను కూడా యాడ్ చేస్తున్నారు. ఇందులో సత్య కీలకపాత్ర పోషించగా.. రితిక నాయక్ హీరోయిన్గా నటించింది. వీరితోపాటు తులసి , వీటివి గణేష్, బుల్లి రాజు, మురళీధర్ గౌడ్ , సునీల్, మహేష్ అచంట తదితరులు కీలకపాత్రను పోషించారు. ఎస్ . తమన్ సంగీతాన్ని అందించారు. అటు టికెట్స్ కూడా భారీగా అమ్ముడుపోతుండడంతో ఇటు చిత్ర బృందం వరుణ్ తేజ్ లేటెస్ట్ ఫోజులతో పంచుకున్న పోస్టర్లు కూడా ఆపేదెవరు అనే రేంజ్ లో ఉన్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు..

Tags:    

Similar News