స్టార్ హీరోయిన్ మెటీరియల్‌కి స్టార్ హీరోలతో అవకాశాలేవీ?
మానస వారణాసి ఇప్పటివరకూ టూటైర్ హీరోల సరసన కథానాయికగా నటించింది. అయితే చరణ్, బన్ని, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సరసన ఛాన్సుంటుందా?
నిజానికి సమంత, తమన్నా, అనుష్క, త్రిష, ఇలియానా తరహాలో అందరికీ స్టార్ హీరోల సరసన వేగంగా అవకాశాలు రావడం అరుదు. ఇలియానాకు ఒకే ఒక్క దేవదాస్ పెద్ద బూస్ట్ ఇచ్చింది. తర్వాత పోకిరితో ఎదురే లేకుండా ఎదిగేసింది.
అనుష్క, తమన్నా జర్నీ గురించి సమంత అజేయమైన ప్రయాణం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. నేటితరంలో రష్మిక మందన్న, సాయిపల్లవి, మీనాక్షి చౌదరి స్టార్ హీరోయిన్ స్టాటస్ ని ఆస్వాధిస్తున్న తీరు గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే ఇటీవలి కాలంలో ఒక తెలుగమ్మాయి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. తనను చూడగానే స్టార్ హీరోయిన్ మెటీరియల్ అని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. పైగా అందాల పోటీల రాణిగా నిరూపించుకుని వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేది ఎప్పుడు? అంటే దానికి ఇంకా సమయం ఉందనే సన్నివేశం చెబుతోంది.
మానస వారణాసి ఇప్పటివరకూ టూటైర్ హీరోల సరసన కథానాయికగా నటించింది. అయితే చరణ్, బన్ని, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సరసన ఛాన్సుంటుందా? పెద్ద హీరోల సరసన నటిస్తేనే ఈ బ్యూటీ కెరీర్ వేగంగా టేకాఫ్ అవుతుంది. రష్మిక తరహాలో ఈ బ్యూటీ కూడా అలాంటి అవకాశాల్ని వేగంగా అందుకుంటుందా? అందుకు అవసరమైన ప్రోత్సాహం తెలుగు హీరోల నుంచి ఉంటుందా? అన్నది చూడాలి. తెలుగమ్మాయిలు ఛామింగ్ లుక్స్ తో ప్రతిభతో కట్టి పడేస్తున్నా స్టార్లు గా ఎదగడానికి ఎందుకనో ఆపసోపాలు పడాల్సి వస్తోంది. అలా కాకుండా మానస విషయంలో విభిన్నంగా ఏం జరుగుతుందో వేచి చూడాలి.