ఆస్కార్ రేసులో ఈ మూడింటికి ఛాన్స్ !

అయితే భ‌విష్య‌త్ లో ఓ మూడు భారీ సినిమాలు మాత్రం ఆస్కార్ కి వెళ్లే అవ‌కాశాలున్నాయి.;

Update: 2026-03-15 14:50 GMT

ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డుల సందడి తారా స్థాయికి చేరింది. ఏ సినిమా ఏఏ విభాగాల్లో అవార్డులు అందుకుంటుంది? అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అలాగే మళ్ళీ భారతీయ సినిమా ఎప్పుడు ఆ వేదికపై మెరుస్తుందా? అని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగానూ ఎదురు చూస్తున్నారు. ఆస్కార్ వేదిక‌పై `ఆర్ ఆర్ ఆర్`సృష్టించిన‌ సంచలనం తర్వాత గత ఏడాది ఆ స్థాయి సందడి కనిపించలేదు. అయితే భ‌విష్య‌త్ లో ఓ మూడు భారీ సినిమాలు మాత్రం ఆస్కార్ కి వెళ్లే అవ‌కాశాలున్నాయి.

`వారణాసి`, `టాక్సిక్`, `రామాయణం. ప్ర‌ముఖంగా వార‌ణాసి, రామాయ‌ణం చిత్రాల‌ను చూస్తుంటే? దేశానికి మ‌ళ్లీ ఆస్కార్ వాటితోనే సాధ్య‌మ‌వుతుందా?; అన్న‌ది అంద‌రిలోనూ ఆస‌క్తిని రెట్టింపు చేస్తుంది. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. దర్శక ధీరుడు రాజమౌళి - మహేష్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `వారణాసి` పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళికి ఇప్పటికే హాలీవుడ్ సర్కిల్స్‌లో విశేషమైన గుర్తింపు ఉంది. `ఆర్ ఆర్ ఆర్` తో అకాడమీ సభ్యుల మనసు గెలుచుకున్న రికార్డు ఉంది. ఈసారి ఒక గ్లోబల్ అడ్వెంచర్ కథతో రాబోతున్నారు. `వార‌ణాసి` మేకింగ్ విలువ‌లు, రాజమౌళి విజన్ తో ఆస్కార్ బరిలో నిలుస్తాయని విశ్లేషకుల అంచ‌నా. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ , టెక్నికల్ విభాగాల్లో వార‌ణాసి గ్లోబల్ ఆడియన్స్‌ను క‌నెక్ట్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. కాబ‌ట్టి రాజ‌మౌళి ఆస్కార్ ప్ర‌య‌త్నాలు చేసే అవ‌కాశాలున్నాయి.

అలాగే భారతీయ ఇతిహాస గాథ `రామాయణం` హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలతో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. నితిష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో అత్యున్నత సాంకేతికతతో రూపొందిస్తున్నారు. ఇందులో రాముడి పాత్ర‌లో రణబీర్ కపూర్‌ను సరికొత్తగా చూపించ‌బోతున్నారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప‌ చిత్రం అయ్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. విజువల్ వండర్‌గా నిలవడమే కాకుండా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో గట్టి పోటీనిచ్చే స‌త్తా రామాయ‌ణానికి ఉంది. భారతీయ వేద పురాణాలను గ్లోబల్ టెక్నాలజీతో మేళవించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు.

అలాగే కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న `టాక్సిక్` కూడా ఆస్కార్ రేసులో నిలిచే మరో శక్తివంతమైన సినిమా అవ్వొచ్చు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడతో పాటు ఆంగ్ల భాషలోనూ రూపొందుతోంది. విలక్షణమైన కథాంశం రా ఇన్ ఇంటెన్సిటీతో కూడిన డార్క్ యాక్షన్ డ్రామా అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెర‌కెక్కిస్తున్నారు. యశ్ గ్లోబల్ అప్పీల్ , దర్శకురాలి మేకింగ్ స్టైల్ ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్ల వరకు తీసుకెళ్లే అవకాశం లేక‌పోలేదు. వ‌చ్చే ఏడాది ఈ మూడు సినిమాలు భార‌త్ నుంచి ఆస్కార్ ఎంట్రీకి వెళ్ల‌గ‌లిగితే తిరుగుండ‌దు.

Tags:    

Similar News