మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?
రాజకుమారుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు మహేష్ బాబు.
రాజకుమారుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు మహేష్ బాబు. మొదటి మూవీతోనే ప్రేక్షకులను హృదయాలను గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ సూపర్ స్టార్ గా ఎదిగాడు... ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. 1600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. ప్రతి షాట్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకొని సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే ఉద్దేశ్యం తో రాజమౌళి ఉన్నాడు. మహేష్ బాబు సైతం ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.
నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ స్టార్ డైరెక్టర్ తో చేస్తున్నాడా...
వారణాసి లాంటి అత్యంత ప్రస్టేజీయస్ ప్రాజెక్ట్ తరువాత మహేష్ బాబు నుంచి వచ్చే మూవీ ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండాలి. అందుకే ఆయన స్పెషల్ కేర్ తీసుకొని మరి సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన లిస్టులో సందీప్ రెడ్డివంగా తో కథ చర్చలు జరుపుతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా దురంధర్ మూవీ తో సక్సెస్ సాధించిన ఆదిత్య ధర్ సైతం మహేష్ కి కథ వినిపించాడట. ఫైనల్ గా వీళ్ళిద్దరు అతని లిస్ట్ లో ఉన్నారు. వీళ్లలో ఎవరి కథను ఫైనల్ చేస్తాడు. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
హాలీవుడ్ రేంజ్ కథ కోసం వెయిటింగ్
మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్ కథ కోసం వెయిట్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. జేమ్స్ బాండ్ తరహా పాత్ర చేయాలని మహేష్ కి ఎప్పటి నుంచో కోరిక ఉందట. వారణాసి తో హాలీవుడ్ లో తనకి మార్కెట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుందని వెయిట్ చేస్తున్నాడట. అలాంటి కథను మహేష్ బాబు కి వినిపించి ఆ సబ్జెక్ట్ ను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగే దర్శకుడు ఎవరు అనే విషయంలో తొందర్లో క్లారిటి వస్తుందట.