త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

ప్రస్తుతం ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయిలో పోటీ పడుతుంది. రాజమౌళి సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు డిఫరెంట్ మేకింగ్ తో మన సినిమాలను హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్తున్నారు.

Update: 2026-11-02 07:32 GMT

ఒకప్పుడు మాటల తూటాలను పేలుస్తూ, థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపిస్తూ, భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన దర్శకుడు త్రివిక్రమ్...ఆయన నుంచి సినిమా వస్తుందంటే సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ ప్రియుల వరకు ఒక రకమైన ఆసక్తి ఉండేది. ఈ మధ్య కాలంలో ఆయన మేకింగ్ మరియు కథల ఎంపికలో కంఫర్ట్ జోన్ కే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన 'ఆదర్శ కుటుంబం' సినిమా విషయంలో ఇదే చర్చ మొదలైంది. లాజిక్ లకు తావులేకుండా రొటీన్ సీరియల్ తరహా మేకింగ్ తో సినిమాను చుట్టేశారనే అసంతృప్తి ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. పదునైన సంభాషణలకు పేరుగాంచిన త్రివిక్రమ్ ఈ సినిమాలో అనవసరమైన ప్రాస లతో ప్రేక్షకుడి ఓపికకి పరీక్ష పెట్టారనే కామెంట్స్ వస్తున్నాయి. గుంటూరు కారం సినిమాలో మేకింగ్ అయిన బాగుంటుంది. కానీ ఇందులో అది కూడా కొరవడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాన్ ఇండియా రేస్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన...

ప్రస్తుతం ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయిలో పోటీ పడుతుంది. రాజమౌళి సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు డిఫరెంట్ మేకింగ్ తో మన సినిమాలను హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. తద్వారా గురూజీ తో చేయబోయే మూవీ మీద కూడా అంచనాలు తార స్థాయి కి వెళ్లిపోతాయి. అందులో ఎంత మాత్రం తడబడిన సినిమా అనుకున్న విజయాన్ని సాధించకపోవచ్చు. కాన్సెప్ట్ విషయంలో క్లారిటీ ని మెయింటైన్ చేస్తూనే ఈ జనరేషన్ కి తగ్గట్టుగా హాలీవుడ్ స్టాండర్డ్ లో మేకింగ్ ఉండాలి.

గురూజీ ఈ విషయాల్లో అప్డేట్ అవ్వాల్సిందేనా...

ఒకప్పుడు తను రాసిన ప్రాస లకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. కాబట్టి వాటిని పక్కన పెట్టి బలమైన సంభాషణలను రాయాలి. విజువల్ వండర్స్ ను క్రియేట్ చేయాలి. పకడ్బంది ప్రణాళికలతో స్క్రీన్ ప్లే రాసుకోవాలి. క్యారెక్టరైజేషన్స్ బాగా డిజైన్ చేసుకోవాలి. తను తీసే సినిమాలోని ప్రపంచాన్ని బిల్డ్ చేయగలగాలి... మొత్తానికైతే ఎన్టీఆర్ ను టాప్ హీరోగా నిలబెట్టే సినిమా తీయాలి...

Tags:    

Similar News