ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైం మేనేజ్మెంట్ ఇక.. స్క్రిప్ట్ గా జరిగేలా కనిపిస్తోంది. దీనికి ముఖ్య కారణం సెన్సార్ నిబంధనలు.

Update: 2026-11-02 07:34 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైం మేనేజ్మెంట్ ఇక.. స్క్రిప్ట్ గా జరిగేలా కనిపిస్తోంది. దీనికి ముఖ్య కారణం సెన్సార్ నిబంధనలు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు సెన్సార్ సమస్యలు మరింత పెరగనున్నాయి. సినిమా విడుదలకు ముందు నిర్మాతలు ఎన్నో విషయాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో వచ్చే సమస్యలు ఇప్పుడు నిర్మాతలకు మరింత టెన్షన్ పెంచుతున్నాయి.

తాజాగా సెన్సార్ బోర్డు తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇకపై చివరి నిమిషంలో పనులు పూర్తి చేసే విధానానికి చెక్ పడేలా కనిపిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తాజాగా కీలక సూచనలు చేసింది. సినిమా సెన్సార్‌కు పంపించే సమయానికి అన్ని పనులు పూర్తయి ఉండాలని స్పష్టం చేసింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వంటి అన్ని అంశాలు ఫైనల్ వెర్షన్‌లో ఉండాలని తెలిపింది.

గతంలో కొంతమంది నిర్మాతలు సినిమా పూర్తి కాకముందే సెన్సార్‌కు పంపించేవారు. సెన్సార్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి మిగిలిన పనులను పూర్తి చేసేవారు. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలో సినిమా విడుదలకు సిద్ధం చేసుకునే అవకాశం ఉండేది.

కానీ ఇప్పుడు కొత్త నిబంధనలతో అలాంటి ప్లానింగ్ కుదరకపోవచ్చు. మొత్తం పూర్తి కాకుండా సెన్సార్ కి వెళ్తే అక్కడ సెన్సార్ సభ్యులు తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సినిమా విడుదల తేదీని ముందుగానే ప్రకటించినా.. సెన్సార్ ప్రక్రియ వేగంగా పూర్తవదని బోర్డు స్పష్టం చేసింది. కాబట్టి అన్నీ జాగ్రత్తలు తీసుకొని.. సెన్సార్ పూర్తి చేసుకుంటేనే విడుదల తేదీ కన్ఫామ్ అవుతుంది.

దీంతో ఇకపై నిర్మాతలు సినిమా విడుదలకు చాలా ముందుగానే అన్ని పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనల వల్ల ఒక మంచి విషయం కూడా ఉంది. సినిమాలు పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత సెన్సార్‌కు వెళ్తే, ముందుగానే సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల విడుదల తేదీ విషయంలో స్పష్టత రావడంతో పాటు ప్రమోషన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రణాళిక ప్రకారం చేసుకోవచ్చు. ఈమధ్య పెద్ద సినిమాల విషయంలో విడుదల తేదీ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రూల్ వల్ల అందులో కూడా తేడా రావచ్చు.

కానీ సెన్సార్ ఆలస్యమైతే సినిమా ప్రమోషన్స్ నుంచి థియేటర్ బుకింగ్స్ వరకు అన్ని వ్యవహారాలపై ప్రభావం పడుతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ కొత్త నిబంధనలు తెలుగు సినిమాల విడుదలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి.. అనేది చూడాలి.

Tags:    

Similar News