• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ క్యారెక్టర్...

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

| ఒకప్పుడు సుకుమార్ అంటేనే మనకు గుర్తొచ్చేది లాజిక్కులు, లెక్కలు. అందుకే ఆయనను ముద్దుగా లెక్కల మాస్టర్ అని పిలుస్తుంటారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-02 08:25 GMT

ఒకప్పుడు సుకుమార్ అంటేనే మనకు గుర్తొచ్చేది లాజిక్కులు, లెక్కలు. అందుకే ఆయనను ముద్దుగా లెక్కల మాస్టర్ అని పిలుస్తుంటారు. కథలో ఎన్నో చిక్కులు పెట్టి, వాటిని ఆసక్తికరంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఒకప్పుడు రాజమౌళి కూడా సుకుమార్.. మాస్ సినిమాల వైపు వస్తే తమ పరిస్థితి ఏమిటని సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన క్యారెక్టర్లు అన్నీ కూడా లాజిక్కులతో రాస్తారు. అలాంటి సుకుమార్ హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మాత్రం చాలాసార్లు లెక్కలు తప్పడనే చెప్పాలి.

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 17 సినిమా.. ఇప్పుడు ఈ విషయంలో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఇస్తారనే చాలామంది చూస్తున్నారు.

అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. రంగస్థలం సినిమా నుంచి సుకుమార్ తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలపై నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. మహిళా పాత్రలను చూపించే విధానంపై కొన్ని సందర్భాల్లో విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఆయన శిష్యుల సినిమాల్లో కూడా ఇదే విషయం చాలా వివాదాలకు దారితీసింది. రామ్ చరణ్ నటించిన బుచ్చిబాబు సానా పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర పై ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిన విషయమే. అలాగే శ్రీకాంత్ ఓదెల ది పారడైజ్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పైన కూడా ఎన్నో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. మొత్తానికి సుకుమార్ శిష్యులు ఇద్దరు తెరకెక్కించిన రెండు చిత్రాల పైన ఈ మధ్య పెద్ద దుమారమే రేగింది.

ఇలాంటి పరిస్థితుల్లో RC 17 విషయంలో సుకుమార్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, హీరోయిన్ పాత్రకు కూడా అంతే గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రల విషయంలో లెక్కలు తప్పినా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో చిన్న తప్పు కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. కాబట్టి ఈసారి ఈ పాత్రలో చిన్న తప్పులు జరిగినా.. ఈసారి లెక్కల మాస్టర్.. హీరోయిన్ సబ్జెక్టులో పూర్తిగా ఫెయిల్ అయినట్టే అవుతుంది.

అందుకే RC 17 విషయంలో హీరోయిన్ క్యారెక్టర్ లెక్కలు మాత్రం తప్పకూడదు మాస్టర్. ఈ పాత్రను సరిగ్గా తీర్చిదిద్దితే సినిమాకు మంచి పేరు వస్తుంది. అదే విషయంలో పొరపాటు జరిగితే మాత్రం సుకుమార్ ప్రతిష్టపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకొని.. సుకుమార్ ఈ సినిమా కథలో హీరోయిన్ క్యారెక్టర్ రాసుకోవడం మంచిది.

Tags:    
  • rc17 
  • sukumar 
  • ramcharan 
  • telugucinema 
  • heroinerole 

Similar News

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

బెదిరింపుల‌తో ఆందోళ‌న‌లో బాలీవుడ్ స్టార్లు.. బుల్లెట్ ప్రూఫ్‌తో హై అలెర్ట్

2026-11-02 07:05 GMT

మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?

2026-11-02 06:52 GMT

ఏడాదిలో ఇన్ని సినిమాలు చూడటం సాధ్యమేనా? 1,207 మూవీస్‌తో గిన్నిస్ రికార్డు!

2026-11-02 06:50 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

రామాయణ.. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ఎంత తేడానో తెలుసా..?

2026-11-02 06:01 GMT

Tupaki Exclusive -‘ది ట్రైటర్స్ తెలుగు’ ఎలిమినేషన్ తర్వాత హర్షవర్ధన్, శ్రీదేవి చౌదరి, ప్రగతి ఇంటర్వ్యూ

2026-11-02 05:39 GMT

Copyright @2026

Powered by Blink CMS