రామాయణ.. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ఎంత తేడానో తెలుసా..?

భారతీయ ఇతిహాసం ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’.

Update: 2026-11-02 06:01 GMT

భారతీయ ఇతిహాసం ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఈ సినిమా ప్రపంచ ఇంగ్లీష్ ప్రీమియర్ ఘనంగా జరిగింది. అయితే ఈ ప్రదర్శన తర్వాత ఇంగ్లీష్ వెర్షన్ మరియు ఇండియన్ లాంగ్వేజ్ వెర్షన్ల రన్ టైమ్ విషయంలో ఒక ఆసక్తికరమైన తేడా బయటకు వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రెండు వెర్షన్ల మధ్య నిడివి వ్యత్యాసం:

మేకర్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 'రామాయణ' ఇంగ్లీష్ వెర్షన్ రన్ టైమ్ 2 గంటల 47 నిమిషాలుగా ఉండగా.. హిందీ, తెలుగుతో సహా ఇతర ఇండియన్ లాంగ్వేజ్ వెర్షన్ల నిడివి ఏకంగా 3 గంటల 15 నిమిషాలుగా ఉంది. అంటే ఇంగ్లీష్ వెర్షన్‌తో పోలిస్తే భారతీయ భాషల వెర్షన్ దాదాపు 28 నిమిషాలు ఎక్కువ నిడివితో ప్రేక్షకు ముందుకు రాబోతోంది. ఇక ఈ వ్యత్యాసం వెనుక ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేశారు.

పాశ్చాత్య ప్రేక్షకుల కోసం ప్రత్యేక స్క్రిప్ట్:

ఈ సినిమా కేవలం డబ్బింగ్ వెర్షన్ మాత్రమే కాదని నిర్మాత స్పష్టం చేశారు. హాలీవుడ్ మరియు వెస్ట్రన్ ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా ఇంగ్లీష్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా ఒక సరికొత్త స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఇక ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘గ్లాడియేటర్’ వంటి హాలీవుడ్ యాక్షన్ ఎపిక్స్ తరహాలో కథను ఎంతో వేగంగా, ఆసక్తికరంగా నడిపించేలా ఈ ఇంగ్లీష్ కట్‌ను రూపొందించారు.

పాటల తొలగింపుతో తగ్గిన నిడివి:

భారతీయ సినిమాల్లో కథా ప్రవాహానికి, భావోద్వేగాలకు పాటలు మరియు సుదీర్ఘమైన డ్రామా ఎంతో ముఖ్యం. కానీ ఇంగ్లీష్ వెర్షన్‌లో వెస్ట్రన్ ఆడియన్స్ శైలికి తగ్గట్టు పాటలను పూర్తిగా తొలగించారు. ఇక పాటలను తీసివేసి కేవలం కథ, యాక్షన్‌పై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల ఇంగ్లీష్ వెర్షన్ నిడివి 25 నుండి 30 నిమిషాలు తగ్గి లీనర్‌గా, ఫాస్ట్‌గా మారింది.

అంతర్జాతీయ స్థాయిలో ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ మ్యూజిక్:

నమిత్ మల్హోత్రా, కేజీఎఫ్ స్టార్ యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ తో పాటు అంతర్జాతీయ ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్ ఈ సినిమాకు కలిసి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఇక తొలి భాగాన్ని 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఇక మొత్తానికి చూస్తే, ‘రామాయణ’ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్‌లో హాలీవుడ్ సినిమాలకు పోటీగా నిలిపేందుకు మేకర్స్ ఇంగ్లీష్, ఇండియన్ వెర్షన్లను వేర్వేరు రన్ టైమ్‌లతో డిజైన్ చేశారు. ఇక పాశ్చాత్యులను, భారతీయ ప్రేక్షకులను సమర్థవంతంగా ఆకట్టుకోవడానికి తీసుకున్న ఈ నిర్ణయం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News