సముద్రంలో చావుని టచ్ చేశాడు!

Update: 2015-07-21 16:15 GMT
అతని అదృష్టం బాగున్నట్లుంది... లేచిన వేళా విశేషమో, ఏమో కానీ... చావుకి అడుగుదూరంలో నిలిచి, టచ్ చేసి మరీ సజీవంగా బయటపడ్డాడు! గ్రామాల్లోని మాట్లాడుకునే మాటలా చెప్పాలంటే... మనోడికి ఇంకా భూమిమీద నూకలున్నాయి! ఈ వార్త చదివి, వీడియో చూస్తే... ఈ ఉపోద్గాతం పెద్ద ఎక్కువేమీ అనిపించదు!

ఇక విషయానికి వస్తే... దక్షిణాఫ్రికాలోని సముద్రంలో ఒక భారీ షార్క్ దాడి చేసి ఈడ్చుకెళ్లినా తప్పించుకోగలిగాడు ఒక అదృష్టవంతుడు! అతడే ప్రముఖ ఆస్ట్రేలియా సర్ఫర్ మిక్ ఫ్యానింగ్. వాల్డ్ సర్ఫ్ లీగ్ ఛాంపియన్ అయిన ఇతడిపై షార్క్ ఎటాక్ చేసి నీళ్లలోకి లాక్కుపోయేందుకు ప్రయత్నించింది. సముద్రపు అలలు సైతం ఇతడ్ని బలంగా నెట్టేశాయి. అయితే అదృష్టవశాత్తు చాలా వరకూ సేఫ్ జోన్ కి చేరుకున్న తర్వాత... రెస్క్యూ బోట్‌లో వచ్చిన ఇతని సహచరులు పూర్తిగా గట్టెక్కించారు! సర్ఫింగ్‌లో ఇప్పటికి మూడుసార్లు మిక్ ట్రోఫీలు సాధించినా... ఇలా ఒక షార్క్ తనపై దాడిచేయడం మాత్రం మొదటిసారే!

అనంతరం మాట్లాడిన మిక్... వెనక ఎవరో లాగుతున్నట్లు అనిపించింది... తిరిగిచూసేసరికి భయంకరమైన షార్క్ ... ఒక్కసారిగా షాక్ తిన్నాను. ఎంతో సాహసంతో ధైర్యంగా తప్పించుకోగలిగాను... సమయానికి సహచరులు వచ్చి సేవ్ చేశారు అని చెప్పుకొచ్చాడు మృత్యుంజయుడు!
Tags:    

Similar News