బిడ్డకంటే బీఎండబ్ల్యూ ఎక్కువైపోయింది!

Update: 2015-07-18 04:11 GMT
చాలా మంది చాలారకాల వస్తువులకు విలువిస్తుంటారు. జంతువులకూ విలువిస్తారు. మరికొందరు తోటిమనుషులకు విలువిస్తారు. మనకు ఇష్టమైనవాటికి, మనల్ని ఇష్టపడేవారు ఇష్టపడేవాటికి విలువనివ్వడం తప్పుకాదు కానీ... ఆ విషయంలో కడుపున పుట్టిన బిడ్డకంటే కూడా ఒక వస్తువుకు విలువ్వడం అతి దారుణం! దీన్ని ఆయా వస్తువులపై ప్రేమ అనాలో లేక అమాయకత్వంతో కూడిన మూర్ఖత్వం అనుకోవాలో తెలియని పరిస్థితి. ఇటువంటి మూర్ఖురాలు కనిపించింది, అటువంటి దారుణ సంఘటన చైనాలో చోటుచేసుకుంది!

ఒక బీఎండబ్ల్యూ కారులో మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ కారులో ఇరుక్కుపోయాడు. ఆ సమయంలో కారు తలుపులు తెరుచుకోకపోవడంతో గుక్కపట్టి ఏడవడం మొదలుపెట్టాడు. ఈ సమయంళో అక్కడే ఉన్న ఆ బాలుడి తల్లి తాళాలు మిస్ అయిపోవడంతో తాళాలు తయారు చేసే వ్యక్తికోసం వేచి చూద్దాం అని అంటుందే తప్ప... కారు అద్దాలు పగలగొట్టి బాబుని బయటకు తీసుకురావడానికి మాత్రం అంగీకరించలేదు! కారు లోపల బాలుడి పరిస్థితి చూసి అంతా చలించారు... ఒక్క ఆ తల్లి (బీఎండబ్ల్యూ కారు ఓనర్) తప్ప!

పరిస్థితి చేయిదాటిపోయేలా ఉండటంతో... చివరికి అగ్నిమాపక సిబ్బంది బలవంతంగా కారు అద్దాలు పగలగొట్టి బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. బిడ్డకంటే బీఎండబ్ల్యూ కే ఎక్కువ విలువ ఇచ్చిన ఈ మాతృమూర్తి యవ్వారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది!
Tags:    

Similar News