ఇస్మార్ట్ గా మాజీలు అయ్యారు....
స్మార్ట్ సిటీలకు చైర్మన్లను ఆ మధ్య వైసీపీ సర్కార్ నియమించింది. పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీతో ఎక్కడెక్కడ పదవులు అంటూ వెతికి మరీ స్మార్ట్ సిటీలకు చైర్మన్లను ప్రకటించారు. అయితే ఆ తరువాత చూస్తే ఇక్కడ పదవులు నియమించడం కుదరదు, టెక్నికల్ గా కూడా చెల్లనేరదు.
దీని మీద ఇప్పటిదాకా ఎవరూ కోర్టుకు వెళ్ళకపోవడంతో వైసీపీ సర్కార్ కి పరువు నిలిచింది. దాంతో దిద్దుబాటు చర్యలకు దిగి తాము నియమించిన వారి నుంచి ఆ పదవులు వెనక్కు లాగేసుకుంది.
మరి దీని కధా కమామీషూ ఏంటయ్యా అంటే చాలానే ఉంది. ఏపీలో తిరుపతి, విశాఖపట్నం. అమరావతి, కాకినాడ సిటీలను స్మార్ట్ సిటీలుగా కేంద్రం గుర్తించింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చులను కేంద్రమే నిధులు ఇచ్చి భరిస్తుంది.
అదే విధంగా కేంద్రం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను కూడా స్మార్ట్ సిటీలలో డిజైన్ చేస్తుంది. ఇక స్మార్ట్ సిటీలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా ఉంటారు. ఇక మునిసిపాలిటీ కమిషనర్లు ఇంచార్జులుగా వ్యవహరిస్తారు.
స్మార్ట్ సిటీలకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలన్నా లేక నిధులను ఖర్చు చేయాలన్నా అన్ని అధికారాలు మునిసిపల్ శాఖ అధికారులకే ఉంటుంది.
మరి ఉత్సవ విగ్రహాల మాదిరిగా స్మార్ట్ సిటీలకు చైర్మన్ పదవ్నులను నియమించడం అంటే నిజంగా పదవుల పందేరం కోసం ఎంచుకున్న కొత్త మార్గమని చెప్పకతప్పదు, అదే విధంగా ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన మరో 33 మునిసిపాలిటీల పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఈ నేపధ్యంలో స్మార్ట్ సిటీలకు చైర్మన్లుగా నియమించేశారు. దాదాపు నలభై మంది ఈ కీలక పదవులను అలంకరించారు. నిజానికి వారికి ఏ విధమైన గౌరవ వేతనమూ లేదు. అదే విధంగా వారికి హోదా తప్ప అధికారమూ లేదు.
మరి ఎందుకు ఈ పదవులు అంటే ఇచ్చామనిపించుకోవడానికే. ఇపుడు కళ్ళు తెరచిన పెద్దలు ఆదరాబాదరాగా రాజీనామాలను కోరుతున్నారు. దాంతో నిన్ననే పదవి ఇచ్చారు కదయ్యా అని బాధగా మూలుగుతూ ఈ రోజువాటికి రాజీనామాలు చేస్తున్నారు. మూణ్ణాళ్ళ ముచ్చట అంటే ఇదేనా అని కూడా తలచుకుని వాపోతున్నారు. మొత్తానికి చూస్తే ఇస్మార్ట్ గా మాజీలం అయిపోయామని వారంతా కుమిలిపోతున్నారు.